Beetroot : మనం తీసుకునే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే, ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. చాలా మంది బీట్ రూట్ ని ఇష్టపడరు. కానీ బీట్ రూట్ ని తీసుకోవడం వలన ఎన్నో లాభాలని పొందొచ్చు. ఈ లాభాలను చూస్తే కచ్చితంగా మీరు కూడా బీట్ రూట్ ని తినడం అలవాటు చేసుకుంటారు. బీట్ రూట్ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి అవుతుంది. రక్తహీనత, గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు. బీట్ రూట్ లో ఉండే పోషక పదార్థాలు మనల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి.
బీట్ రూట్ వల్ల కలిగే లాభాల గురించి, ఎవరు బీట్ రూట్ ని తీసుకోకూడదు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. బీట్ రూట్ తీసుకుంటే మైనర్ తలసేమియా, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఐరన్ అనేది చాలా ముఖ్యం. ఐరన్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. బీట్ రూట్ ని తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. కాలేయం శుభ్రంగా ఉంటుంది కూడా.
బీట్ రూట్ ని తీసుకోవడం వలన హృదయ సంబంధిత సమస్యలకు కూడా దూరంగా ఉండొచ్చు. అథ్లెట్స్ బీట్ రూట్ ని తీసుకుంటే స్టామినా బాగా పెరుగుతుంది. క్రీడల సమయంలో క్రీడాకారులు 90 నిమిషాల ముందు బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే, శక్తి బాగా పెరుగుతుంది. రోజూ ఒక గ్లాసు బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే, సులభంగా కొవ్వుని కరిగించుకోవచ్చు. ఉత్సాహంగా ఉండడానికి అవుతుంది. బీట్ రూట్ ని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ని తీసుకుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ఫోలిక్ యాసిడ్ అందుతుంది. కొందరిలో బిటురియా ఉంటుంది. అంటే బీట్ రూట్ తిన్న తర్వాత మలం, మూత్రం ఎరుపు రంగులో రావడం. ఆక్సలేట్ అనేది సహజంగా బీట్ రూట్ లో ఉంటుంది. అటువంటి సమస్య ఉన్నట్లయితే బీట్ రూట్ ని తీసుకోవద్దు. కానీ ఏమీ పెద్ద ప్రమాదం కాదు. అయితే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఆక్సలేట్ ని అందించే బీట్ రూట్ ని తీసుకోకూడదు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…