Beauty Tips : ఈ చిట్కాల ముందు ఫెయిర్‌నెస్ క్రీములు అస‌లు ప‌నికిరావు.. ముఖం ఎలా మారుతుందంటే..?

March 23, 2023 10:38 PM

Beauty Tips : అందంగా క‌నిపించ‌డం కోసం నేడు మ‌హిళ‌లు అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్ల‌డం లేదంటే వివిధ ర‌కాల క్రీములు, పౌడ‌ర్లు గ‌ట్రా రాయ‌డం, అవ‌స‌ర‌మైతే న్యూట్రిషన్ పిల్స్ మింగ‌డం వంటి అనేక ప‌నులు చేస్తున్నారు. కానీ వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను మాత్రం వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ బాధ లేకుండా అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధతుల‌తో కూడిన చిట్కాల‌ను పాటిస్తే కేవ‌లం 2 వారాల్లోనే చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు. దీంతో చ‌ర్మం మృదుత్వాన్ని కూడా సంత‌రించుకుంటుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక టేబుల్ స్పూన్ కీర‌దోస ర‌సంలో కొంత నిమ్మ‌ర‌సం క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించాలి. అనంత‌రం చ‌ర్మం పొడిగా అయ్యాక క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం కాంతిని పొందుతుంది. చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. ముల్లంగి ర‌సాన్ని తీసి దాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. చ‌ర్మం మృదుత్వాన్ని పొందుతుంది. ఉసిరి కాయ ర‌సం 1 టీస్పూన్‌, తేనె 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని రెండింటినీ బాగా క‌ల‌పాలి. అనంత‌రం ముఖానికి రాసుకోవాలి. రాత్రి పూట ఇలా చేయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. దీంతో చ‌ర్మం ఆరోగ్యాన్ని పొందుతుంది. కాంతివంతంగా మారుతుంది.

Beauty Tips follow these home remedies
Beauty Tips

రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు కొద్దిగా పెరుగును తీసుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. రోజూ ఇలా చేస్తే కేవ‌లం 2 వారాల్లోనే ముఖం సౌంద‌ర్యాన్ని పొందుతుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మంలో ఉన్న మృత‌క‌ణాలు, దుమ్ము, ధూళి తొల‌గిపోతాయి. తేనె, దాల్చిన చెక్క పొడిల మిశ్ర‌మాల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని ముఖానికి రాయాలి. కొద్ది సేపు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పాల‌ను తీసుకుని బాగా క‌లిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉండే దుమ్ము, ధూళి క‌ణాలు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

నారింజ పండు తొక్క‌ల‌ను ఎండ బెట్టి పొడి చేయాలి. ఈ పొడికి కొంత పాలు క‌లిపి అనంతరం వ‌చ్చే మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తుంటే చ‌ర్మం మృదువుగా మార‌డ‌మే కాదు, కాంతివంతంగా కూడా అవుతుంది. బొప్పాయి పండు ముక్కను తీసుకుని దాన్ని పేస్ట్‌లా చేసి అందులో నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 30 నిమిషాలు ఆగాక క‌డిగేసుకోవాలి. దీంతో చ‌ర్మంపై ఉండే మృత క‌ణాలు పోయి కొత్త క‌ణాలు ఏర్ప‌డుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఒక టొమాటోను తీసుకుని దాన్ని మెత్త‌ని పేస్ట్‌లా మార్చుకోవాలి. అందులో కొంత నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం మంచి రంగును సొంతం చేసుకుంటుంది. మృదువుగా కూడా మారుతుంది.

ఒక టేబుల్ స్పూన్ తేనె, అంతే మోతాదులో ప‌సుపును తీసుకుని మిశ్ర‌మంగా క‌లిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. దీని వ‌ల్ల చ‌ర్మంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now