Barley Water : బార్లీ గింజలను ఎక్కువగా బీర్ తయారీలో ఉపయోగిస్తారు. అంతమాత్రం చేత వాటితో తయారు చేసిన నీటిని తాగితే మత్తు వస్తుందనుకునేరు. అలా ఏం కాదు. ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి. అనంతరం 15 నుంచి 20 నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి. వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి. అనంతరం ఆ నీటిని చల్లార్చి వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో అనేక అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు.
పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రం అవుతుంది. ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. బాగా వేడి చేసిన వారు బార్లీ నీటిని తాగడం వల్ల దాన్నుంచి ఉపశమనం పొందుతారు. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. బార్లీ నీటిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కీళ్లు, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్న వారు బార్లీ నీటిని తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ అదుపులో ఉంటుంది. గర్భంతో ఉన్న స్త్రీలు బార్లీ వాటర్ తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఇతరులకు కూడా మూత్రాశయ సమస్యలు ఉంటే బార్లీ నీటిని నిత్యం తాగవచ్చు. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బార్లీ నీటికి ఉంది. రోజూ బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి. బాలింతలు బార్లీ వాటర్ తాగితే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో ఉండే పోషకాలు శరీర మెటబాలిజంను క్రమబద్దీకరిస్తాయి. దీంతో బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గాలనుకుంటే బార్లీ వాటర్‌ను ఉదయంతోపాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…