Ayurveda Tips : ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు. ప్రతిరోజూ శిరస్సు, ముక్కు, పాదాలకి నూనె రాసుకుంటే మంచిది. మలమూత్ర మార్గాలని, పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
వెంట్రుకలను, గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి. పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యం. భయం లేకుండా ధైర్యవంతుడిగా ఉంటే జీవితంలో పైకి వస్తారు. ఏదీ ఆలోచిస్తూ భోజనం చేయకూడదు. ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలి. రాత్రి కానీ ఉదయం కానీ భోజనం చేయకుండా ఉండడం అసలు మంచిది కాదు. అజీర్తి సమస్యలు లేకుండా చూసుకోవాలి.
తిన్న వెంటనే మళ్ళీ తింటే కూడా ఆరోగ్యం పాడవుతుంది. రోజూ అన్ని రకాల రుచులను తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే రుచి తీసుకోవడం వలన బలహీనతకి కారణమవుతుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక రోగాలు కలుగుతాయి. పాలు, పెరుగు తృప్తిగా తింటే ముసలితనం త్వరగా రాదు. విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనేక సమస్యలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెని నోట్లో వేసుకుని తెల్లని నురగ వచ్చే వరకు పుక్కిలించి ఆ తర్వాత బయటకి వదిలేయాలి. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. దీని వలన దంతాలు బలంగా ఉంటాయి. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావు.
నెయ్యి తీసుకున్నప్పుడు ఆవు నెయ్యిని తీసుకోవడం శ్రేష్టం. పప్పు ధాన్యాలలో పెసలు చాలా ఉత్తమమైనవి. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది. దుంపలలో అల్లం శ్రేష్టం. ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారయ్యే బెల్లం శ్రేష్టం. మినుములని అతిగా వాడకండి. మలమూత్ర వేగములని ఆపకూడదు. ఆహారం అరగకపోయినప్పుడు ఆహారాన్ని ద్రవ రూపంలో తీసుకుంటే మంచిది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములకి అడ్డు పడుతుంది. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…