Ayurveda Tips : ఆయుర్వేద గ్రంథాల‌లో చెప్ప‌బ‌డిన ర‌హ‌స్య ఆరోగ్య సూక్తులు

July 24, 2023 8:02 AM

Ayurveda Tips : ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూట‌లా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు. ప్రతిరోజూ శిరస్సు, ముక్కు, పాదాలకి నూనె రాసుకుంటే మంచిది. మలమూత్ర మార్గాలని, పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

వెంట్రుకలను, గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి. పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం చాలా ముఖ్యం. భయం లేకుండా ధైర్యవంతుడిగా ఉంటే జీవితంలో పైకి వస్తారు. ఏదీ ఆలోచిస్తూ భోజనం చేయకూడదు. ప్రతిరోజూ సమయానికి భోజనం చేయాలి. రాత్రి కానీ ఉదయం కానీ భోజనం చేయకుండా ఉండడం అసలు మంచిది కాదు. అజీర్తి సమస్యలు లేకుండా చూసుకోవాలి.

Ayurveda Tips that were told in old books
Ayurveda Tips

తిన్న వెంటనే మళ్ళీ తింటే కూడా ఆరోగ్యం పాడవుతుంది. రోజూ అన్ని రకాల రుచుల‌ను తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే రుచి తీసుకోవడం వలన బలహీనతకి కారణమవుతుంది. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక రోగాలు కలుగుతాయి. పాలు, పెరుగు తృప్తిగా తింటే ముసలితనం త్వరగా రాదు. విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనేక సమస్యలు కలుగుతాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నువ్వుల నూనెని నోట్లో వేసుకుని తెల్లని నురగ వచ్చే వరకు పుక్కిలించి ఆ తర్వాత బయటకి వదిలేయాలి. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. దీని వలన దంతాలు బలంగా ఉంటాయి. దంతాలకు సంబంధించిన సమస్యలు కూడా రావు.

నెయ్యి తీసుకున్నప్పుడు ఆవు నెయ్యిని తీసుకోవడం శ్రేష్టం. పప్పు ధాన్యాలలో పెసలు చాలా ఉత్తమమైనవి. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది. దుంపలలో అల్లం శ్రేష్టం. ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారయ్యే బెల్లం శ్రేష్టం. మినుములని అతిగా వాడకండి. మలమూత్ర వేగములని ఆపకూడదు. ఆహారం అరగకపోయినప్పుడు ఆహారాన్ని ద్రవ రూపంలో తీసుకుంటే మంచిది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములకి అడ్డు పడుతుంది. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment