Ashwagandha Powder : ఒకప్పుడంటే ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా హడావిడి పనులు.. ఇలాంటివి ఏవీ ఉండేవి కావు. జనాలంతా ఎంతో ప్రశాంతంగా, ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవించేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. అంతేకాదు.. మంచి శృంగార సామర్థ్యాన్ని కూడా కలిగే ఉండేవారు. అందుకే అప్పట్లో ఒక్కొక్కరు 10 మంది దాకా పిల్లల్ని కనేవారు. కానీ ఇప్పటి వారు అలా కాదు. నిత్యం పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా శరీరం అనారోగ్యాలకు గురవుతోంది. దీనికి తోడు పనిచేస్తున్న వాతావరణం, పోషకాల లేమి కారణంగా నేటి తరుణం వారు తమ శారీరక దృఢత్వాన్ని, శక్తులను కూడా కోల్పోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో కొత్తగా పెళ్లయిన యువ దంపతులు కూడా పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. అయితే అలాంటి సామర్థ్యాన్ని అందించడమే కాదు, పిల్లలు కావాలనుకునే వారి కోసం అశ్వగంధ మొక్క వేర్ల చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ చూర్ణాన్ని ఉపయోగిస్తూ తయారు చేసే పలు పదార్థాలను వాడితే లైంగిక పటుత్వం పెరగడమే కాదు, పిల్లలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ పదార్థాలు ఏమిటో, వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంద గ్రాముల అశ్వగంధ పొడిని తీసుకుని దానికి పావు కిలో నెయ్యి కలపాలి. ఆ మిశ్రమానికి గాలి తగలకుండా జాగ్రత్తపడాలి. అందుకు గాను ఏదైనా ఓ డబ్బాలో దాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ వేడి పాలు లేదా గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీంతో లైంగిక పటుత్వం పెరుగుతుంది. పురుషుల్లో వీర్యం చక్కగా ఉత్పత్తి అవుతుంది. స్త్రీలకైతే రుతుక్రమం సరిగ్గా అవుతుంది. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని అరగ్లాస్ వేడి పాలలో కలిపి స్త్రీలు తీసుకోవాలి. ప్రధానంగా వారు రుతుక్రమం అయిన 4వ రోజు నుంచి ఇలా చేయాల్సి ఉంటుంది. దీంతో వారికి పిల్లలు కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే పురుషులు ఇలా తీసుకుంటే వారిలో లైంగిక సామర్థ్యం పెరిగి వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంది.
అశ్వగంధ చూర్ణాన్ని 3 లేదా 4 గ్రాముల మోతాదులో తీసుకుని, అదే పరిమాణంలో చక్కెరను దానికి కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ గ్లాస్ వేడి పాలలో కలిపి తీసుకోవాలి. దీంతో శృంగార సామర్థ్యం మునుపటి కన్నా మెరుగవుతుంది. అశ్వగంధ చూర్ణం, నెయ్యి, చక్కెరలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం సేవిస్తుంటే తద్వారా పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. వీర్యం నాణ్యంగా కూడా ఉంటుంది. అండం దగ్గరకు ఆ వీర్య కణాలు చురుగ్గా వెళ్తాయి కూడా. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…