Amla And Ginger Tea : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల సూత్రాలని పాటిస్తూ ఉంటారు. చాలా మంది ఇంటి చిట్కాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని అనుకుంటారు. అయితే ఉసిరి, అల్లం ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఉసిరి, అల్లం రెండూ కూడా అనేక లాభాలను కలిగిస్తాయి. ఈ రెండిటితో టీ చేసుకుని మనం తాగడం వలన బరువు తగ్గడం మొదలు అనేక ప్రయోజనాలని పొందవచ్చు.
ఉసిరి, అల్లం రెండిట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ రెండిటినీ కలిపి మనం టీ తయారు చేసుకుని తాగడం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బ తినకుండా చూసుకోవచ్చు. ఉసిరి, అల్లం టీ తీసుకుంటే బరువు తగ్గడానికి కూడా అవుతుంది. ఈ టీ ని తీసుకోవడం వలన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా ఈ టీ బాగా పని చేస్తుంది.
ఉసిరి, అల్లం టీ లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటతో పోరాడడంలో సహాయం చేస్తుంది. ఇలా లివర్ ఆరోగ్యాన్ని కూడా ఈ టీ తో పెంపొందించుకోవచ్చు. ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఈ టీ అందిస్తుంది. ఇలా ఈ ప్రయోజనాలని సులభంగా ఈ టీ తో పెంపొందించవచ్చు.
ఇక టీ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ముందు నాలుగు కప్పులు నీళ్లు తీసుకోండి. అందులో ఒక చెంచా ఉసిరి పొడి, ఒక చెంచా అల్లం పొడి వేసుకోండి. ఒక కప్పు మిగిలే వరకు బాగా మరిగించుకోండి. తర్వాత స్టవ్ ఆపేసి, ఆ నీటిని ఒక కప్పులో పోసుకోవాలి. ఇందులో కొంచెం నల్ల ఉప్పు, తేనె కలుపుకుని తీసుకోవాలి. వేడిగా అయినా చల్లారిన తర్వాత అయినా ఈ టీ ని తీసుకోవచ్చు. ఇలా చక్కటి లాభాలని ఈ టీ తో పొందవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…