Curd : పాలను తోడు వేసి తయారు చేసే పెరుగంటే చాలా మందికి ఇష్టమే. కొందరైతే భోజనం చివర్లో పెరుగుతో తినంది అస్సలు సంతృప్తి చెందరు. భోజనం అసంపూర్తిగా ముగిసినట్టుగానే భావిస్తారు. అయితే దీని మాట ఎలా ఉన్నా పెరుగుతో మనకు అనేక రకాల లాభాలే ఉన్నాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతో కలిపి పలు ఆహార పదార్థాలను తింటే పలు రకాల అనారోగ్య సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. కొద్దిగా పెరుగులో చక్కెర కలుపుకుని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా పోతాయి. కొంత వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తినాలి. దీని వల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు పోతాయి.
ఓ కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీని వల్ల మలబద్దకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల మంచి ప్రోబయోటిక్స్, ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీని వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది.
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు మటుమాయమైపోతాయి. ఈ మిశ్రమం యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…