ఆధ్యాత్మికం

Lord Brahma : బ్ర‌హ్మ దేవుడికి ఆల‌యాలు ఎందుకు ఉండ‌వో తెలుసా..? ఆ ఒక్క చోట మాత్రం ఉంది..!

Lord Brahma : భార‌త దేశం దేవాల‌యాల‌కు నెల‌వు. ఇక్క‌డ స‌కల చ‌రాచ‌ర సృష్టికి కార‌ణ భూతులైన దేవ‌త‌ల‌ను నిత్యం ఆరాదిస్తారు భ‌క్తులు. అయితే హిందూ శాస్త్ర ప్ర‌కారం అంద‌రికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్ర‌హ్మ‌కు మాత్రం ఈ భూమి మీద ఆల‌యాలు క‌నిపించ‌వు. స‌ర్వ కోటి ప్రాణుల త‌ల‌రాత రాసే బ్రహ్మ‌కు ఎందుకు దేవాల‌యాలు లేవు.. కార‌ణం ఏంటి..? బ‌్ర‌హ్మ‌కు భూలోకంలో పూజ‌లు ఎందుకు జ‌ర‌గ‌వు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వం లోకకళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగుమహర్షిని పంపుతారు. అలా బయలు దేరిన భృగుమహర్షి తొలుత సత్యలోకాన్ని చేరుకుంటాడు.

ఆ స‌మయంలో వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు, ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీ దేవి సంగీతంలో లీనులై ఉంటారు. భృగుమ‌హ‌ర్షి రాక‌ను గ‌మ‌నించ‌కుండా వారి ధ్యానంలో ఉండిపోతారు. దాంతో కోపోద్రేక్తుడైన భృగుమ‌హ‌ర్షి క‌లియుగంలో భూమి మీద నీకు పూజ‌లు ఉండవని శాపమిచ్చి వెళ్లిపోతాడు. అందువ‌ల‌నే బ్ర‌హ్మకు భూలోకంలో దేవాల‌యాలు ఉండ‌వ‌ని.. పూజ‌లు కూడా జ‌ర‌గ‌వ‌ని.. చెబుతారు. రాజస్థాన్ లో అజ్మీర్ కు వాయువ్య భాగంలో సుమారు 10 కిలో మీటర్ల దూరంలో పుష్కర్ దగ్గర గాయత్రి గిరిలో శక్తి పీఠం ఉంది. దీనినే బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. అమ్మవారి కంఠాభరణం ఇక్కడే పడిందని భక్తుల విశ్వాసం.

Lord Brahma

ఇక్కడి అమ్మవారు గాయత్రీదేవిగా పూజ‌లందుకుంటారు. నిత్యం హోమాలు, పూజలతో కళకళలాడుతుంది. ఈ సరస్సు ఒడ్డునే బ్రహ్మ దేవుని ఆలయం ఉంది. ఇదొక్కటే ప్రపంచం మొత్తం మీద బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయం. మనదేశంలో అతి ముఖ్య తీర్థ‌రాజంగా ఇది ప్రసిద్ధి చెందింది. అందుకే దీనికి తీర్థ‌ రాజ్ అనే సార్థ‌క నామం ఏర్ప‌డింది. ఇక ప‌ద్మ‌పురాణం ప్ర‌కారం ఇంకో క‌థ ఉంది. పద్మపురాణంలో వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజలను హింసించటం చూసి తట్టుకోలేక తన చేతిలోని తామర పువ్వునే ఆయుధంగా విసిరి బ్రహ్మ దేవుడు ఆ రాక్షసుడిని సంహరిచాడట.

ఆ సందర్భంలో ఆ పువ్వు నుండి మూడు రేకులు రాలి మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడ్డాయి. వాటికే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పేర్లు పెట్టారు. బ్రహ్మ చేతి నుండి జారి పడిన తామర పువ్వు పడిన ప్రదేశం కనుక పుష్కర్ అనే పేరు సార్థ‌కమైంది. అయితే అక్క‌డి ప్ర‌జ‌లు చెప్పుకుంటున్న‌క‌థ ప్ర‌కారం.. సరస్వతీ దేవి ఎదుటే శివుడు, విష్ణువు క‌లిసి బ్ర‌హ్మ‌కు గాయ‌త్రి అనే అమ్మాయితో వివాహం చేయిస్తారట. దీనిని చూసి తట్టుకోలేని సరస్వతీ దేవీ బ్ర‌హ్మ‌ను వృద్ధుడిగా మారిపోమంటూ శ‌పిస్తుంద‌ట. అందుక‌నే ఆయ‌న‌కు దేవాల‌యాలు కూడా ఉండ‌వ‌ని చెబుతారు. ఇక పుష్కర్ లో ప్రతి ఏడాది ఒంటెల పరుగు పందాలు జరుగుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM