Cloves : ల‌వంగాలను మీరు తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

September 28, 2023 7:52 PM

Cloves : మనం వంటల్లో మసాలాలని రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. కొన్ని రకాల ఆహార పదార్థాలు, మసాలా సామాన్లు లేకపోతే అస్సలు రుచిగా కూడా ఉండవు. ఎక్కువగా మనం ఉపయోగించేవి లవంగాలు. లవంగాలు వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. లవంగం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి..?, ఏ సమస్యలకి పరిష్కారం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలు కాస్త ముదురు రంగులో మనకి కనబడుతుంటాయి. కానీ వీటిని మొదట తెంపినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

ఎండినప్పుడు గోధుమ రంగులోకి ఇవి మారుతూ ఉంటాయి. ఎక్కువగా వీటిని మనం బిర్యానీ వంటి వాటిని చేసుకోవడానికి వాడుతూ ఉంటాము. అయితే, లవంగాలని వాడటం వలన నొప్పి నివారిణిగా అవి పని చేస్తాయి. లవంగంతో నూనె వంటివి కూడా తయారు చేస్తూ ఉంటారు. లవంగం నూనె అద్భుతమైన లాభాలను ఇస్తుంది.

amazing health benefits of cloves
Cloves

కీటకాల బాధనుండి ఈజీగా బయటపడడానికి అల్మారాల్లో లవంగాలు నూనెని ఒక కాటన్ క్లాత్ లో పెట్టి ఉంచితే, కీటకాలు వంటివి చేరవు. లవంగం జీర్ణ ఎంజైమ్ ని పెంచేస్తుంది. జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. కడుపు ఉబ్బరం, గుండెలో మంట, వికారం, వాంతులు వంటి సమస్యలు లవంగాలతో తొలగించుకోవచ్చు. అంతేకాకుండా లవంగాలు కలరా కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి.

విరోచనాలు, వాంతులు వంటివి కలరా వలన వస్తూ ఉంటాయి. అవి కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి. కలరా బ్యాక్టీరియా కి వ్యతిరేకంగా లవంగాలు పనిచేస్తాయి. అలానే, క్యాన్సర్ కి వ్యతిరేకంగా కూడా లవంగాలు పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలో చికిత్స చేయడానికి లవంగాలని ఉపయోగించవచ్చు.

కాలేయ ఆరోగ్యానికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి. షుగర్ ఉన్న వాళ్ళు లవంగాలు తీసుకుంటే, కంట్రోల్ లో షుగర్ లెవెల్స్ ని ఉంచుకోవచ్చు. తెల్ల రక్త కణాలని లవంగాలు పెంచుతాయి. లవంగాలను తీసుకోవడం వలన పంటి నొప్పి కూడా బాగా తగ్గుతుంది. తలనొప్పి తో బాధపడినప్పుడు కూడా లవంగాలు చాలా చక్కగా పనిచేస్తాయి. లవంగాలని పేస్ట్ కింద కానీ పౌడర్ కింద కానీ చేసుకుని, రాళ్ల ఉప్పుతో కలిపి పాలల్లో కలిపి తీసుకుంటే, తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇలా లవంగాలతో అనేక లాభాలని మనం పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now