Acupressure For Diabetes : రోజుకు ఇలా 3 సార్లు చేస్తే.. షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంద‌ట తెలుసా..?

March 27, 2023 5:02 PM

Acupressure For Diabetes : డ‌యాబెటిస్‌. మ‌ధుమేహం.. పేరేదైనా నేడు దీని బారిన చాలా మంది ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్‌-1 డ‌యాబెటిస్ మాత్ర‌మే కాదు, జీవ‌న విధానంలో మార్పుల వ‌ల్ల కూడా డ‌యాబెటిస్ వ‌స్తోంది. దీనికి టైప్‌-2 డ‌యాబెటిస్ అని పేరు. అధికంగా బ‌రువు పెర‌గ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, స‌రైన టైంలో భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, రాత్రి పూట ఎక్కువ‌గా మేల్కొని ఉండి ఆల‌స్యంగా నిద్రించ‌డం.. ఇలా అనేక కార‌ణాల వ‌ల్ల టైప్‌-2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే ఏ త‌ర‌హా డ‌యాబెటిస్ వ‌చ్చినా ఇక దానికి మందులు వాడ‌డ‌మే. ప‌ర్మినెంట్ చికిత్స లేదు. కానీ కింద సూచించిన విధంగా చేస్తే టైప్ 1, 2 ఏ డ‌యాబెటిస్ అయినా కంట్రోల్ అవుతుంది. దీంతో మందులు వాడాల్సిన పని లేదు. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

అర‌చేతి నాలుగు వేళ్ల‌ను లోప‌లికి ముడ‌వాలి. ఆ వేళ్లు అర‌చేతి మ‌ధ్య‌లో ట‌చ్ అవ్వాలి. అలా ట‌చ్ అయ్యే క్ర‌మంలో వేళ్ల‌ను చేతికేసి బ‌లంగా ఒత్తాలి. ఇలా 10 సార్లు చేయాలి. అనంత‌రం రెండో చేయితో కూడా ఇలాగే చేయాలి. ఇలా రెండు చేతుల‌కు క‌లిపి మొత్తం 10+10=20 సార్లు చేయాల్సి ఉంటుంది. ఉద‌యం అల్పాహారం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసే ముందు చేతుల్తో ఈ ఆక్యుప్రెష‌ర్ వైద్యం చేయాలి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.

Acupressure For Diabetes do like this daily for three times
Acupressure For Diabetes

పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల చేతిలో ఉండే ప‌లు నాడులు యాక్టివేట్ అవుతాయి. అవి లివ‌ర్‌, పాంక్రియాస్‌ల‌కు క‌నెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఆయా అవ‌య‌వాలు యాక్టివేట్ అవుతాయి. త‌ద్వారా ఇన్సులిన్ ఉత్ప‌న్న‌మ‌వుతుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ‌డమే కాదు, ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెర‌గ‌డంతో షుగ‌ర్ అదుపులోకి కూడా వ‌స్తుంది. ఇలా రోజూ 3 సార్లు చేస్తూ ఉంటే త‌ద్వారా ఇంకా మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. దీంతో నెమ్మ‌దిగా మందుల వాడ‌కాన్ని కూడా త‌గ్గించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment