మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఏం కూర చేయాలో కొన్నిసార్లు దిక్కుతోచదు. అలాంటి సమయంలో కూరతో అవసరం లేకుండా కేవలం అయిదు నిమిషాలలో రుచికరమైన టమోటా రైస్ తయారు చేసుకొని తినవచ్చు. మరి టమోటో రైస్ ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..\
*అర కిలో బియ్యం
*బాగా పండిన టమోటాలు 4
*పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి
*పసుపు చిటికెడు
*కారం అర టీ స్పూన్
*గరం మసాల ఒక టీస్పూన్
*కొత్తిమీర తురుము
*కరివేపాకు
*నూనె
*ఉప్పు తగినంత
*ఆవాలు చిటికెడు
*జీలకర్ర చిటికెడు
*పచ్చిమిర్చి 2
ముందుగా బియ్యం బాగా కడిగి రైస్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయను, టమోటాలను, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి నూనె వేడెక్కిన తరవాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు, ఆవాలు, జీలకర్ర వేయాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఎరుపు వర్ణంలోకి వచ్చేటప్పుడు టమోటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల పాటు చిన్నమంటపై టమాటాలను ఉడికించాలి. తరువాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలియబెట్టాలి. టమోటాలు మెత్తగా అయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమంలోకి ముందుగా తయారుచేసి పెట్టుకున్న అన్నం ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కేవలం ఐదు నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన టమోటా రైస్ తయారైనట్లే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…