సాధారణంగా మాంసాహారం తింటే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయని మనకు తెలుసు. కానీ మాంసాహారం తినే వారికి అదే స్థాయిలో పోషకాలు అందాలంటే ఎంతో ముఖ్యమైన ఆహారాలలో మష్రూమ్స్ ఒకటి . ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మష్రూమ్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. మరి ఎంతో రుచికరమైన స్పైసి… స్పైసి.. మష్రూమ్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.
* మష్రూమ్స్500 గ్రాములు
*వెల్లుల్లి ఒకటి
*కొత్తిమీర తగినంత
*ఉప్పు రుచికి సరిపడా
*కారం ఒక టేబుల్ స్పూన్
*పసుపు చిటికెడు
*ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్
*లవంగాలు 3
*గరం మసాల (మీ ఇష్టం)
*పోపు దినుసులు
*ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు
*నూనె తగినంత
ముందుగా మష్రూమ్స్ నీటిలో కడిగి బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నె ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత పోపు దినుసులు వేసి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎరుపు వర్ణంలోకి మారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మష్రూమ్ వేసి బాగా కలియబెట్టాలి. మష్రూమ్స్ నూనెలో 2నిమిషాలు తర్వాత రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసి మూత పెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత మరొక సారి కలియబెట్టాలి. అవసరమైతే ఒక చిన్న గ్లాస్ నీటిని వేసి తక్కువ మంటపై బాగా ఉడికించాలి. ఈలోగా వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, ధనియాల పొడి, కొత్తిమీర మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఐదు నిమిషాలు తర్వాత మష్రూమ్స్ బాగా మెత్తగా అయిన తరువాత కారం పొడి వేసి తక్కువ మంట పైనే రెండు నిమిషాలు వేయించాలి. రెండు నిమిషాల తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి. ఈ విధంగా చేయటం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది.రెండు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టి స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన స్పైసీ మష్రూమ్ ఫ్రై తయారైనట్లే. వేడి వేడిగా ఉండే ఈ మష్రూమ్ ఫ్రై తో చపాతీ లేదా పరోటాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…