ఎంతో రుచికరమైన.. తియ్యని మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం..

June 18, 2021 4:24 PM

ఎన్నో రకాల స్వీట్లలో అందరూ ఎంతగానో ఇష్టపడే పాటలు మైసూర్ పాక్ ఒకటి. అందరూ ఎంతో ఇష్టంగా తినే మిల్క్ మైసూర్ పాక్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*పాల పొడి ఒక కప్పు

*మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు

*నెయ్యి రెండు కప్పులు

*చక్కెర రెండున్నర కప్పులు

*బేకింగ్ సోడా చిటికెడు

*నీళ్లు ఒక కప్పు

*ఫుడ్ కలర్

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలపొడి మైదా పిండి ఒక కప్పు నెయ్యి వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె ఉంచి పంచదార వేసి సరిపడా నీళ్లు పోసి పాకం తయారు చేసుకోవాలి. ఈవిధంగా గరిటతో బాగా కలియబెడుతూ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని తీగపాకం వచ్చేవరకు కలియబెట్టాలి.తీగ పాకం వచ్చిన తరువాత పాలపొడిని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలియబెడుతూ బుడుగలు వచ్చేవరకు బాగా ఉడికించాలి. తర్వాత ఈ మిశ్రమంలో కి కొద్దికొద్దిగా నెయ్యి కలుపుతూ మిశ్రమం మొత్తం బాగా దగ్గరపడే వరకు కలపాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తం బాగా చిక్కగా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఒక దీర్ఘ చతురస్రాకారపు బాక్స్ లోకి నెయ్యి పూసి తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం అందులోకి వేయాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా చల్లారిన తర్వాత మనకు ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో కట్ చేసి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ మైసూర్ పాక్ తయారైనట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now