ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారీ విధానం

June 17, 2021 6:02 PM

మనం ఇదివరకు సేమియా పాయసం, పెసరపప్పు పాయసం, శనగపప్పు పాయసం గురించి విన్నాము వాటి రుచిని కూడా తెలుసుకున్నాము. కానీ వీటన్నింటి కంటే భిన్నంగా రస్క్ పాయసం గురించి బహుశా వినక పోయి ఉండవచ్చు. అయితే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

* రస్క్ పొడి ఒక కప్పు

*చిక్కని పాలు ఒకటిన్నర కప్పు

*నెయ్యి ఒక టేబుల్ స్పూన్

*చక్కెర 5 టీ స్పూన్లు

*ఏలకుల పొడి టేబుల్ స్పూన్

*జీడిపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు

*ఎండుద్రాక్ష కొద్దిగా

*పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలు, కొబ్బరి తురుము దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పాలను బాగా మరిగించుకొని వాటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రస్క్ పొడి వేసి కలియబెడుతూ తరువాత చల్లారిన పాలు పోసి ఉండలు లేకుండా కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి గరిటతో కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఏలకుల పొడి వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రస్క్ పాయసం తయారైనట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now