మీకు ఏమైనా తినాలనిపిస్తుందా.. అయితే మన ఇంట్లో గోధుమరవ్వ ఉంటే చాలు ఎంతో రుచికరమైన పాయసం క్షణాలలో రెడీ చేయవచ్చు. ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం చేయడం ఎలానో ఇక్కడ తెలుసుకుందాం.
*గోధుమ రవ్వ ఒక కప్పు
*నెయ్యి కొద్దిగా
*బెల్లం ఒకటిన్నర కప్పు
*కొబ్బరి పాలు రెండు కప్పులు
*ఏలకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు
*జీడిపప్పు, ఎండు ద్రాక్ష గుప్పెడు
*నీళ్లు తగినన్ని
ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో బెల్లం తగినన్ని నీళ్లు వేసి బాగా ఉడికించాలి.ఉడుకుతున్న మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమరవ్వ వేసి చిన్న మంటపై బాగా కలియబెడుతూ, రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొబ్బరి పాలు, యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన పాయసంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ పాయసం తయారైనట్లే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…