కీమా ఎగ్ మఫిన్స్ తయారీ విధానం

June 5, 2021 10:48 AM

మటన్ కీమాతో ఎంతో రుచి కరమైన మఫిన్స్ తినడానికి ఎంతో మంది ఇష్టపడుతుంటారు. నోరూరించే ఈ మఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.


కావలసిన పదార్థాలు

*మటన్ కీమా ఒక కప్పు

*గుడ్లు 8

*బేకింగ్ పౌడర్ టేబుల్స్ స్పూన్

*వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్

*టమోటా తరుగు రెండు స్పూన్లు

*ఉల్లిపాయ ముక్కలు

*రెండు పచ్చిమిర్చి ముక్కలు

*ఉప్పు తగినంత

*బటర్ టేబుల్ స్పూన్

*మిరియాల పొడి పావు టీ స్పూన్

*బేకింగ్ సోడా పావు టీ స్పూన్

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కీమా, రెండు గుడ్లు, వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులోకి మిగిలిన గుడ్లు, బటర్, టమోటో తరుగు, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత మఫిన్ కప్పులు తీసుకొని మధ్య వరకు ముందుగా తయారు చేసుకున్న కీమా మిశ్రమం వేసుకోవాలి. తరువాత దానిపై భాగం గుడ్డు బటర్ మిశ్రమం వేయాలి. ఈ కప్పులలో 20 నుంచి 25 నిమిషాలపాటు చేసుకుంటే ఎంతో రుచికరమైన కీమా ఎగ్ మఫిన్స్ తయారైనట్లే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now