సాధారణంగా మాంసాహారులైతే చికెన్ లాలిపాప్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ శాఖాహారులు కూడా ఆ విధమైనటువంటి అనుభవాన్ని పొందాలనుకునే వారికి పొటాటో లాలీపాప్స్ ఒక మంచి స్నాక్స్ ఐటమ్ అని చెప్పవచ్చు.మరి పొటాటో లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*బంగాళాదుంపలు 2
*పచ్చిమిర్చి ముక్కలు టీ స్పూన్
*కొత్తిమీర తురుము రెండు టేబుల్ స్పూన్లు
*పసుపు చిటికెడు
*కారం పొడి టీ స్పూన్
*జీలకర్ర చిటికెడు
*నిమ్మరసం టేబుల్ స్పూన్
*ధనియాల పొడి అర టీ స్పూన్
*ఉప్పు రుచికి సరిపడినంత
*అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్
*చాట్ మసాలా టీ స్పూన్
*మైదా పిండి ఒక టేబుల్ స్పూన్
*బ్రెడ్ పౌడర్ ఒకటిన్నర కప్పు
*నీళ్లు సరిపడినంత
*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత
ముందుగా బంగాళదుంపలను మెత్తగా ఉడకబెట్టి వాటి తోలు తీసి బాగా చిదిమి పెట్టుకోవాలి. ఈ బంగాళా దుంప మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా బ్రెడ్ పొడి, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, చాట్ మసాలా వేసి చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. మన చేతికి నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేయాలి. ఒక పాత్రలో మైదా పిండికి కొద్దిగా నీళ్లు జతచేసి దోసె పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న బంగాళదుంప ఉండలను మైదా పిండిలో ముంచి వెంటనే బ్రెడ్ పొడిలో అటు ఇటు దొర్లించాలి.ఈ దొర్లిన ఉండలను బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఈ ఉండలను లాలీపాప్ స్టిక్స్ గుచ్చి టమాటో కెచప్ తో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…