Jamun Chat: వర్షాకాలంలో నోరూరించే జామున్ చాట్ ఇలా చేస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!

July 29, 2021 2:39 PM

Jamun Chat: వర్షాకాలంలో వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే చాలామంది వేడివేడిగా కారంకారంగా ఏదైనా తినాలి అని భావిస్తారు. ఇలా తినాలనిపించే వారికి జామున్ చాట్ ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ రెసిపీ తినడానికి ఎంతో ఇష్టపడతారు. మరి నోరూరించే రుచికరమైన జామున్ చాట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

*గులాబ్ జామ్ పౌడర్ 150 గ్రా

*పాలు కొద్దిగా

*ఉల్లిపాయ ఒకటి

*తురిమిన క్యారెట్ అర కప్పు

*ఒక టీ స్పూన్ బూంది

*పెరుగు ఒక కప్పు

*ఉప్పు తగినంత

*కారం తగినంత

*చాట్ మసాలా రుచికి తగినంత

*కొత్తిమీర తురుము

*నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో కి గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని కొద్దిగా పాలు వేసుకుంటూ పిండి మెత్తగా కలుపుకోవాలి. పిండి మెత్తగా అయిన తర్వాత కొద్దిగా నూనె రాయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని గులాబ్ జాములు మాదిరిగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా వేడి అయిన తరువాత ఈ గులాబ్ జామ్ లను బాగా బంగారు ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేటులోకి తీసి వాటిని మధ్యలోకి కట్ చేయాలి. కట్ చేసిన ఈ జామూన్ పై పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, బూంది, కొత్తిమీర, చాట్ మసాలా కలుపుకొని సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now