ఆరోగ్యకరమైన డ్రైఫ్రూట్స్ పాయసం తయారీ విధానం!

June 6, 2021 11:45 AM

స్వీట్స్ అంటే ఇష్టపడే వారికి డ్రైఫ్రూట్స్ పాయసం ఒక మంచి వంటకం అని చెప్పవచ్చు. డ్రైఫ్రూట్స్ పాయసం తీసుకోవటంవల్ల రుచికి రుచి ని పొందవచ్చు ఆరోగ్యాన్ని కూడా  పెంపొందించుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లో అధిక భాగం పోషకాలు ఉండటం వల్ల ఈ పాయసం తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరి డ్రైఫ్రూట్స్ పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*చికెన్ పాలు ఒక లీటర్

*బాదం పప్పు 10

*పిస్తా 15

*చక్కెర ఒక కప్పు

*కుంకుమ పువ్వు చిటికెడు

*ఎండుద్రాక్ష కొద్దిగా

*జీడిపప్పు 10

*ఏలకులపొడి టేబుల్ స్పూన్

*నెయ్యి కొద్దిగా

తయారీ విధానం

ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీరు పోసి అందులోకి ఎండుద్రాక్ష, ఎండిన బెర్రీ పండ్లతో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పాలను వేసి పాలను బాగా మరిగించాలి. ఈ పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి.ఒక ఐదు నిమిషాల పాటు పాలను మరిగించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొన్న డ్రైఫ్రూట్స్ అందులో వేయాలి. ఐదు నిమిషాల పాటు పాలను బాగా మరిగించి తర్వాత పాలలోకి చక్కెర వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా నెయ్యి కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now