స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు. ఎన్నో పోషక విలువలు కూడిన స్వీట్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన స్వీట్ కార్న్ తో పాయసం ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్ పాయసం ఎలా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం.
*స్వీట్ కార్న్ 2 కప్పులు
*చిక్కటి పాలు – 4 కప్పులు,
*నెయ్యి – పావు కప్పు,
*పంచదార – అర కప్పు,
*ఏలకుల పొడి – 1 టీ స్పూన్,
*పిస్తా, కిస్ మిస్,
*జీడిపప్పు,
*బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్లు.
* కుంకుమ పువ్వు చిటికెడు
ముందుగా స్వీట్ కార్న్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. వీటిలో రెండు టేబుల్స్పూన్లు పక్కకు తీసి మిగతా కార్న్స్ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని పిస్తా, బాదం, కిస్ మిస్, జీడిపప్పు బాదం పప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి.
స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొంచం నెయ్యి వేసి ముందుగా కలిపి పెట్టుకున్న వాళ్లు కార్న్ వేసి చిటపట అనే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమంలో మిగిలిన పాలు పోసి కుంకుమపువ్వు వేసి చిన్న మంటపై తరచు కలియబెడుతూ ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత పంచదార ఏలకుల పొడి వేసి కలపాలి.దించే ముందు
జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా, భాదం ముక్కల్ని వేసి స్టౌ ఆఫ్ చేయాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ పాయసం తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…