క్రిస్పీ బ్రెడ్ బోండా తయారీ విధానం

June 5, 2021 2:43 PM

సాయంత్రం పూట ఏవైనా స్నాక్స్ తినాలనిపిస్తే అటువంటి వారికి బ్రెడ్ బోండా మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎంతో రుచికరంగా అతి తక్కువ సమయంలోనే బ్రెడ్ బోండాలు తయారు చేసుకుని సాయంత్ర సమయాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించవచ్చు. మరి బ్రెడ్ బోండాలను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*బ్రెడ్ పౌడర్ ఒకటిన్నర కప్పు

*ఉడికించిన బంగాళదుంప ఒక కప్పు

*జీలకర్ర పొడి పావు టీ స్పూన్

*కొద్దిగా కరివేపాకు

*ఉల్లిపాయ ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు

*ఉప్పు తగినంత

*పులిసిన గట్టి పెరుగు పావు కప్పు

*కారం పొడి అర టీ స్పూన్

*నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత

తయారీ విధానం

ముందుగా ఉడికించిన బంగాళదుంపను మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. అందులోకి జీలకర్ర పొడి, కరివేపాకు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కి బ్రెడ్ పౌడర్ వేసుకొని కొద్దికొద్దిగా పెరుగుని వేస్తూ బోండా పిండిలా కలుపుకోవాలి.ఈ విధంగా పిండిని తయారు చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత బోండాల సైజులో మిశ్రమాన్ని వేసుకుని బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత తీసేయాలి. వేడి వేడిగా ఉన్న ఈ బ్రెడ్ బోండాలను పల్లి చట్నీ లేదా టమోటో సాస్ తో సర్వ చేసుకుంటే ఎంతో క్రిస్పీగా రుచికరమైన బ్రెడ్ బోండాలను ఆస్వాదించవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now