చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది. అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
*చికెన్ 300 గ్రాములు
*పాలకూర 300 గ్రా
*పచ్చిమిర్చి4
*అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు
*యాలకులు 4
*లవంగాలు 4
*దాల్చినచెక్క రెండు
*నూనె తగినంత
*గరం మసాలా పొడి ఒక స్పూన్
*కారం పొడి టేబుల్ స్పూన్
*పసుపు
*ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ లో పాలకూర మిరపకాయలు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసి కుక్కర్ మూత తీయాలి. ఈ విధంగా పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
తరువాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయ్యాక అందులోకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. అవి దోరగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి.అవసరమైతే చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. చికెన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పాలక్ మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ తయారైనట్టే.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…