ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచి మాత్రమే కాకుండా తయారు చేసుకోవడానికి ఎంతో సులభం. ముఖ్యంగా బ్యాచిలర్స్ కు ఎగ్ ఫ్రైడ్ రైస్ సూపర్ ఫాస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. మరి ఎంతో సులువైన రుచికరమైన ఈ ప్రైడ్ రైస్ ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
*ఒక కప్ప రైస్
*కోడిగుడ్లు 3
*కారం అర టీ
*ఉప్పు తగినంత
*పసుపు చిటికెడు
*గరంమసాలా అర టీ స్పూన్
*ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
*కరివేపాకు రెమ్మ
*రెండు పచ్చిమిర్చి ముక్కలు
*నూనె
ముందుగా ఒక కప్పు రైస్ తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ ఉంచి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాలు తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కోడిగుడ్లను పగలగొట్టుకుని అందులో వేయాలి.కోడిగుడ్ల మిశ్రమాన్ని కాసేపు కదలకుండా తక్కువ మంటలో మగ్గించాలి. ఇందులోకి అర టీ స్పూన్ కారం వేసి నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని కలపాలి.ఎక్కువసార్లు కలపడం వల్ల కోడుగుడ్డు చిన్న ముక్కలుగా విడిపోవడంతో తినడానికి రుచిగా అనిపించదు. కనుక ఎక్కువ సార్లు కలియ పెట్టకుండా తక్కువ మంటలో బాగా ఫ్రై చేసుకోవాలి.ఎగ్ మొత్తం ఫ్రీ అయిన తర్వాత అందులోకి ముందుగా తయారు చేసుకున్న అన్నం కలుపుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కలుపుకుని కాస్త కొత్తిమీర తురుము చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే.వేడి వేడిగా ఉన్న ఈ రైస్ లోకి కొద్దిగా ఉల్లిపాయముక్కలు నిమ్మకాయతో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…