Telangana Style Chicken Curry : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. చికెన్ ను ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా, లొట్టలేసుకుంటూ తినేలా చికెన్ కర్రీని తెలంగాణా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణా స్టైల్ చికెన్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ముప్పావు కిలో, ధనియాలు – 2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – 2 ముక్కలు, లవంగాలు – 4, యాలకులు – 4, జీలకర్ర- ఒక టీ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి – 2 పెద్ద ముక్కలు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – 4 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, ఉప్పు – తగినంత, పుదీనా – కొద్దిగా, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
యాలకులు – 2, లవంగాలు – 3, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క.
తెలంగాణా స్టైల్ చికెన్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కొబ్బరి ముక్కలను మంటపై చక్కగా కాల్చుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత జీలకర్ర, గసగసాలు వేసి వేయించాలి. ఇప్పుడు జార్ లో వేయించిన మసాలా దినుసులతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత కరివేపాకు, పసుపు వేసి కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత చికెన్ ముక్కలు, కారం, తగినంత ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పుదీనా వేసి అన్నీ కలిసేలా కలపాలి. దీనిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చికెన్ పూర్తిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తెలంగాణా స్టైల్ చికెన్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే చికెన్ కర్రీ కంటే ఈ విధంగా మసాలా పొడి వేసి చేసే చికెన్ కర్రీ మరింత రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…