Ragi Mudda Recipe : చాలామంది ఉదయాన్నే, మంచి అల్పాహారం కోసం చూస్తున్నారు. ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే, తీసుకుంటున్నారు. మీరు కూడా, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం చూస్తున్నారా..? అయితే, రాగి ముద్ద ట్రై చేయాల్సిందే. రాగి ముద్ద తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ, పూర్వం పూర్వికులు ఇటువంటి ఆహార పదార్థాలను, ఎక్కువగా తయారుచేసుకుని తినేవారు. నిజానికి రాగి ముద్ద తినడం అలవాటు చూసుకుంటే, ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఒకప్పుడు రాగి ముద్ద, గ్రామాల్లో బాగా తినేవారు. ఇప్పుడైతే తగ్గిపోయింది. రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. హెల్దీ డైట్, ఫాలో అయ్యే వాళ్ళు. కచ్చితంగా రాగి ముద్దను తీసుకోవడం మంచిది. వేడి వేడి రాగులతో, ముద్దని సాంబార్ తో లేదంటే, మీకు నచ్చిన వాటితో సర్వ్ చేసుకుంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. రెగ్యులర్ గా రాగులని తీసుకోవడం వలన, శక్తి మెరుగు పడుతుంది. బలంగా మారతారు. రాగి ముద్ద ని అల్పాహారం టైంలో, మధ్యాహ్నం భోజనంలో అలానే రాత్రి భోజనంలో తీసుకోవచ్చు.
రాగి ముద్దను ఎలా తయారు చేయాలి అనే విషయానికి వచ్చేస్తే.. రెండు కప్పులు నీళ్లలో, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత, ఒక గరిటతో కలుపుతూ రాగి పిండిని వేయండి. తక్కువ మంటతో, నెమ్మదిగా కలపండి. ఎక్కువ నీళ్లు పోసారంటే, రాగి ముద్ద అవదు. పిండి వేస్తూ, మీరు ఐదు నుండి పది నిమిషాల పాటు పిండిని పైనుండి కిందకి కదుపుతూ ఉండాలి.
ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసి తర్వాత, చేతికి నెయ్యి రాసుకొని ముద్ద కింద తయారు చేసుకోవాలి. రాగి ముద్ద రెడీ అయిపోయాక, నెయ్యి వేసుకుని తీసుకుంటే బాగుంటుంది. క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈజీగా ఇది జీర్ణం అవుతుంది. ఇందులో, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…