Jonna Rotte : ఈ చిట్కాలతో జొన్న రొట్టెలని తయారు చేసుకుంటే.. మృదువుగా వస్తాయి..!

July 16, 2023 12:03 PM

Jonna Rotte : జొన్నలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఇటువంటి వాటిని డైట్ లో తీసుకుంటున్నారు. అయితే చాలామంది జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడతారు. కానీ వాటిని ఎలా చేసుకోవాలో తెలియక ఆగిపోతూ ఉంటారు. ఇలా కనుక మీరు జొన్న రొట్టెలని చపాతీ పీట మీద చేస్తే ఎంతో సులభంగా వస్తాయి. పైగా సాఫ్ట్ గా కూడా ఉంటాయి. జొన్న రొట్టెలు తీసుకోవడం వలన అధిక బరువు సమస్య నుండి బయట పడి మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

దీనికోసం ముందు మీరు జొన్నలని తీసుకుని రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. రెండు రోజులు పాటు జొన్నలని బాగా ఎండబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న ఈ జొన్నలని పిండిలాగా చేసుకోవాలి. ఈ పిండిని రొట్టెల కోసం ఉపయోగించాలి. ఒక కప్పు నీళ్లు స్టవ్ మీద పెట్టి మరిగించి అందులో చిటికెడు ఉప్పు వేయాలి. ఎంత నీళ్లు తీసుకున్నారో అంత జొన్న పిండిని వాటర్ లో వేసేయాలి.

Jonna Rotte anybody can make easily like this
Jonna Rotte

ఈ పిండిని నీళ్ళల్లో వేసాక నెమ్మదిగా పై నుండి కింద దాకా కలుపుకోవాలి. ఆ తరవాత చపాతి పిండిలా బాగా మెత్తగా ఈ పిండిని కలుపుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని వేడి ఎక్కేంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా చపాతిలాగా జొన్న పిండితో వ‌త్తుకోవాలి. పొడి పిండి పెట్టుకుని రొట్టెని వ‌త్తుకుంటూ వెళ్లాలి.

ముందే మీరు చపాతి కర్రతో కాకుండా చేతితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ వ‌త్తుకుంటూ తర్వాత కర్రతో కూడా ప్రెస్ చేస్తూ వ‌త్తుకోవాలి. ఇప్పుడు పెనం మీద రొట్టెను వేసి రెండు చుక్కలు నీళ్ల‌ను వేస్తూ చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఒక క్లాత్ తో పైన ప్రెస్ చేస్తే ఎక్స్‌ట్రా పిండి వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్‌ట్రా పిండి రోటీకి ఉండదు. రొట్టెని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే కచ్చితంగా ఎవరికైనా న‌చ్చుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now