Dry Fruit Laddu Recipe : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలని కొనడం మానేసి, ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నారు. అయితే, చాలామంది ఇళ్లల్లో డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసుకుంటూ ఉంటారు. స్పెషల్ గా అప్పుడప్పుడు, మనం డ్రై ఫ్రూట్ లడ్డుని చేసుకుని తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా క్రేవింగ్స్ ని కూడా ఫుల్ ఫిల్ చేసుకోవచ్చు. పైగా మనం ఈజీగా డ్రైఫ్రూట్ లడ్డూలని తయారు చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా.
మరి ఇక దీనిని ఎలా తయారు చేయాలనే విషయానికి వచ్చేద్దాం. ఎండు ఖర్జూరం, తెల్ల నువ్వులు, నెయ్యి, ఎండు ద్రాక్ష తో పాటుగా కొంచెం చక్కెర కానీ బెల్లాన్ని కానీ తీసుకోవాలి. అలానే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకోండి. ముందు పాన్ పెట్టి, అందులో నెయ్యి వేసి బాగా మరిగిన తర్వాత, కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకుని, వాటికి తగ్గట్టుగా బెల్లం కాని చక్కెర కానీ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మీరు మిక్సీ పట్టేయాలి.
ఇందులో మనం బెల్లం లేదా పంచదారని అలానే ఖర్జూరం లేదంటే ఎండుద్రాక్ష వేసుకుంటాము. వీటి తడికి లడ్డూ అవుతుంది. ఇలా, మనం ఈజీగా డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. పైగా మీరు దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. అయితే, మీరు డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసేటప్పుడు, మరీ పొడి లాగ గ్రైండ్ చేసేసుకోకండి. కొంచెం ముక్కలు లాగానే డ్రై ఫ్రూట్స్ ఉండాలి.
అప్పుడే లడ్డు బాగుంటుంది. మరీ పౌడర్ కింద చేసుకోవద్దు. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే, మీరు కొన్ని రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. రెండు వారాలపాటు నిల్వ ఉంచుకోవాలంటే, ఫ్రిజ్లో పెట్టేసుకోండి. లడ్డూలు తయారు చేసేసుకున్నాక నువ్వుల గింజల్లో లడ్డుని దొర్లించి చేసుకుంటే, ఇంకా క్రిస్పీగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా. అయితే, లడ్డు చేసుకునేటప్పుడు ఒకసారి వేయించి లడ్డుని చేస్తే, అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పాడైపోకుండా ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…