రాఖీ పండుగ వస్తుందంటే చాలు అక్క చెల్లెల్లు తమ అన్నదమ్ములకు రాఖీలను కట్టేందుకు సిద్ధమవుతుంటారు. దూర ప్రాంతాల్లో ఉండేవారి కోసం రాఖీలను ముందుగానే కొని కొరియర్లు లేదా పోస్టులో పంపిస్తుంటారు. ఇక ఈ పండుగ సందర్భంగా స్వీట్లను కూడా ఎక్కువగా తినిపించుకుంటుంటారు. దీంతో స్వీట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.
అయితే రాఖీ పండుగ సందర్భంగా స్వీట్లకు ఉండే గిరాకీని దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ షాపు యజమాని ఏకంగా బంగారంతో స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నాడు. అక్కడి ఘోద్దోద్ రోడ్ ఏరియాలో ఓ షాపు యజమాని బంగారం పూత కలిగిన స్వీట్లను విక్రయిస్తున్నాడు.
సాధారణంగా స్వీట్లపై సిల్వర్ ఫాయిల్ ఉంటుంది. కానీ ఆ షాపు యజమాని తయారు చేయిస్తున్న ఆ స్వీట్లపై 24 క్యారెట్ల బంగారం పూత ఉంటుంది. ఇక ఆ స్వీట్లను కేజీకి రూ.9000 గా విక్రయిస్తున్నారు. బంగారం పూత ఉంటుంది కాబట్టే వాటిని ఆ ధరకు అమ్ముతున్నారు.
అయితే స్వీట్లకు అంత ధర ఉన్నప్పటికీ తమ వ్యాపారం బాగుందని ఆ స్వీట్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటి స్వీట్లను కొనుగోలు చేసేందుకు కూడా చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సీజన్‌లో సూరత్‌లో ఇలా స్వీట్లను తయారు చేయడం మామూలే. కానీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువ ధరకే స్వీట్లను విక్రయిస్తుండడం విశేషం.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…