కడక్‌నాథ్ కోళ్ల గురించి చాలా మందికి తెలుసు. వాటి శరీరం మొత్తం నల్ల రంగులో ఉంటుంది. అయితే ఈ కోళ్ల మాంసం, గుడ్లు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ బ్రాయిలర్ కోళ్లు కేవలం 45 రోజుల్లోనే సుమారుగా 2.50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. కానీ కడక్‌నాథ్ కోళ్లు పెరిగేందుకు అధిక సమయం పడుతుంది. 6 నెలలు పెంచినప్పటికీ అవి 1.50 కిలోల వరకు బరువు మాత్రమే పెరుగుతాయి. దీంతో వాటిని పెంచేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కనుక సహజంగానే ఈ కోళ్లకు ధర ఎక్కువగా ఉంటుంది.
ఇక సాధారణ లేయర్ కోళ్లతో పోలిస్తే కడక్‌నాథ్ కోళ్లు చాలా తక్కువ గుడ్లు పెడతాయి. అవి పిల్లలుగా అయ్యే అవకాశాలు కూడా తక్కువే. అందుకనే ఆ గుడ్లకు ఖరీదు ఎక్కువ. అయినప్పటికీ సాధారణ కోళ్లతో పోలిస్తే ఈ కోళ్ల మాంసంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది. అందువల్ల కడక్‌నాథ్ కోళ్లు సహజంగానే ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. ఇవీ.. వాటి మాంసం, గుడ్లు ఎక్కువ ధర ఉండడం వెనుక ఉన్న కారణాలు.
ఇక కడక్‌నాథ్ కోళ్ల మాంసం ధర కేజీకి రూ.1000 నుంచి రూ.1200 వరకు పలుకుతుండగా, ఒక్క కోడి ధర రూ.850గా ఉంది. ఒక్క కడక్‌నాథ్ కోడిగుడ్డు ధర రూ.30 వరకు ఉంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…