శనివారం, జూన్ 13, 2026
ముఖ్య‌మైన‌వి

మీ దగ్గర పాత 25 పైసల కాయిన్స్‌ ఉన్నాయా ? అయితే రూ.1.50 లక్షలు పొందవచ్చు..!

25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు. ప్రస్తుతం రూ.1 కన్నా తక్కువ విలువ ఉన్న నాణేలను చెలామణీ…

మీ దగ్గర పాత 25 పైసల కాయిన్స్‌ ఉన్నాయా ? అయితే రూ.1.50 లక్షలు పొందవచ్చు..!

25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు. ప్రస్తుతం రూ.1 కన్నా తక్కువ విలువ ఉన్న నాణేలను చెలామణీ చేయడం లేదు. అయితే మీ దగ్గర పాత 25 పైసల నాణేలు ఉంటే మీరు ఒక్కో నాణేనికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. అవును, నిజమే. ఎలాగంటే…

if you have old 25 paisa coin then you can get rs.1.50 lakhs

ఇండియామార్ట్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ తెలుసు కదా. భారత్‌లోనే అతి పెద్ద ఈ-కామర్స్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫాం అది. అందులో 10 కోట్లకు పైగా కొనుగోలు దారులు, 60 లక్షలకు పైగా సప్లయిదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే మీ వద్ద గనక పాత పావలా నాణేలు ఉంటే వాటిని ఫొటో తీసి ఇండియా మార్ట్‌ సైట్‌లో పెట్టవచ్చు. దీంతో వాటికి వేలం నిర్వహిస్తారు. వేలంలో అధిక మొత్తం పాడిన వారికి మీరు ఆ నాణేలను అమ్మవచ్చు. కొనుగోలుదారులతో బేరాలు కూడా ఆడవచ్చు.

ఇండియా మార్ట్‌లో ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా ముందుగా అందులో రిజిస్టర్‌ చేసుకోవాలి. తరువాత కాయిన్లను అమ్మవచ్చు. అయితే మీ వద్ద ఉన్న పావలా నాణెం వెండిది అయి ఉండాలి. దాన్నే అమ్మకానికి పెట్టాలి. వీటితోపాటు 5, 10 పైసల నాణేలను కూడా అమ్మకానికి పెట్టవచ్చు. అలాగే ఇతరులు అమ్మకానికి పెట్టే నాణేలను కొనవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి