ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా ఎండలు మండుతున్నాయి. ఇంకా మే నెల కూడా రాలేదు. అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో మరో ఐదారు రోజుల పాటు తీవ్రమైన వడగాలుల ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఎండల నుంచి రక్షణగా ఉండాలి. తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అయితే బయటకు వెళ్లినప్పుడు ఓకే. కానీ ఇండ్లలో చల్లగా ఉండేందుకు ఏం చేయాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. మార్కెట్‌లో మనకు కూల్ సున్నం దొరుకుతుంది. దాన్ని ఇంటి పైకప్పు మీద రెండు కోటింగ్స్ వేయాలి. ఒకసారి కోటింగ్ వేశాక బాగా ఆరనిచ్చి ఒక రోజు తరువాత రెండో కోటింగ్ వేయాలి. దీంతో ఆ కోటింగ్ పై పడే సూర్య కిరణాల వేడి ఇంట్లోకి ప్రవేశించదు. దీని వల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది.
2. సూర్యుడు అస్తమించిన తరువాత ఇంటి తలుపులు, కిటికీలను కాసేపు తీసి ఉంచాలి. దీంతో ఇంట్లో చల్లగా అవుతుంది.
3. కిచెన్‌లో వంట చేస్తే సహజంగానే ఈ వేడి అంతా ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. అందువల్ల వంటను వీలైనంత త్వరగా ముగించేయండి. కిచెన్ రూమ్‌కు వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. వంట చేశాక దాన్ని కొంత సేపు ఆన్ చేయాలి. దీంతో వేడి బయటకు పోతుంది. ఇంట్లో కొంత మేర చల్లగా అవుతుంది.
4. చాలా మంది ఫ్రిజ్‌లను హాల్ లేదా బెడ్‌రూమ్‌లలో పెడతారు. అలా చేయరాదు. కిచెన్‌లోనే ఫ్రిజ్‌లను ఉంచాలి. ఫ్రిజ్ వల్ల అది ఉన్న ప్రదేశం వేడిగా ఉంటుంది. అందువల్ల దాన్ని కిచెన్‌లోనే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా వేడి తగ్గుతుంది.
5. సూర్యుడు అస్తమించిన అనంతరం ఇంట్లో నేలను నీటితో తుడవాలి. వీలైతే కడగవచ్చు. దీంతో ఇంట్లో కొంత వరకు చల్లగా మారుతుంది.
6. ఇంట్లో ఇండోర్ మొక్కలను పెంచడం వల్ల కూడా వేడి తగ్గుతుంది.
7. సాయంత్రం సమయంలో ఇంట్లో, బయట పెరట్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోయాలి.
8. మధ్యాహ్నం సమయంలో గోనె సంచులను బాగా నీటితో తడపాలి. అనంతరం వాటిని కిటికీలు లేదా తలుపులకు కట్టాలి.
9. మార్కెట్‌లో సన్ ప్రొటెక్షన్ షీట్స్ లభిస్తున్నాయి. వాటిని కూడా కిటికీలు, తలుపులకు కట్టవచ్చు. లేదా వరండాలో వేలాడదీయవచ్చు.
10. ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉపకరణాల వల్ల వేడి ఉద్భవిస్తుంది. కనుక వాటిని అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి.
11. మార్కెట్‌లో వెదురు చాపలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వరండాల్లో వేలాడదీయవచ్చు. వీటి వల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది.
12. వేసవిలో కాటన్ దుస్తులనే ధరించేలా ప్లాన్ చేసుకోండి. రాత్రి నిద్రించే ముందు చల్లని నీటితో స్నానం చేయండి. చల్లని పానీయాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక పరుపు వేడిగా ఉంటుంది. కనుక నేలపై లేదా నేరుగా చెక్కతో తయారు చేసిన మంచం, ఇతర మంచాలపై పడుకునే యత్నం చేయాలి. దీని వల్ల చల్లదనం లభిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…