ముఖ్య‌మైన‌వి

Couple : భార్య భర్తలు తప్పక పాటించాల్సిన 14 రూల్స్ ఇవే.. పడక గదిలో ఆ విషయాలు అస్సలు చర్చించవ‌ద్దు..

Couple : వివాహంతో రెండు శ‌రీరాలు మాత్ర‌మే కాదు, రెండు మ‌న‌స్సులు కూడా ఒక్క‌ట‌వుతాయి. దీంతో దంప‌తులిద్ద‌రూ జీవితాంతం అలా ఒకే మ‌న‌స్సులా మారి జీవిస్తారు. ఎలాంటి క‌ష్ట‌, న‌ష్టాలు వ‌చ్చినా, సుఖం, దుఃఖం క‌లిగినా ఇద్ద‌రూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆద‌ర్శ దాంప‌త్యం అంటారు. ఇలాంటి దంప‌తులు ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ముందుకు సాగుతారు కూడా. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు కూడా ముఖ్యంగా కొత్త‌గా పెళ్లి చేసుకునే వారికి వ‌ర్తిస్తాయి. వారు ఈ టిప్స్‌ను తెలుసుకుని దంప‌తులు ఇద్ద‌రూ వాటిని త‌మ దాంప‌త్య జీవితంలో పాటిస్తే దాంతో లైఫ్ ఈజీ అవుతుంది. ఆద‌ర్శ దంప‌తులుగా ఉండ‌వ‌చ్చు. మ‌రి న‌వ వ‌ధూవ‌రుల‌కే కాదు, భార్య భ‌ర్త‌ల‌కు కూడా వ‌ర్తించే ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

1. కెరీర్ క‌న్నా కుటుంబ స‌భ్యులే ముఖ్య‌మ‌ని భావించాలి. కుటుంబ స‌భ్యుల సౌక‌ర్యం, వీలు అంతా ఓకే అనుకుంటేనే కెరీర్ చూసుకోవాలి. కుటుంబంలో అంద‌రూ ఎలాంటి క‌ల‌హాలు లేకుండా ఉండాలి. ఎలాంటి న‌ష్టాలు వచ్చినా కుటుంబాన్ని వ‌ద‌ల‌కూడ‌దు. దాంతోపాటు కెరీర్‌ను చూసుకోవాలి.

Couple

2. దంప‌తులిద్ద‌రూ ప‌నిచేసే వారు అయితే ఇద్ద‌రూ అన్నింటినీ షేర్ చేసుకోవాలి. అంటే.. రెంటు, బిల్స్‌, ఇత‌ర ఖ‌ర్చులు లాంటివ‌న్న‌మాట‌. ఈ విష‌యంలో ఒక‌రు ఎక్కువ‌, మ‌రొక‌రు త‌క్కువ అన్న భావ‌న రాకూడ‌దు. ఇద్ద‌రూ స‌మానంగా ఖ‌ర్చు పెట్టాలి.

3. దంప‌తుల‌న్నాక ఇద్ద‌రికీ త‌ల్లిదండ్రులు ఉంటారు. వారిని త‌మ వారుగా వారు భావించాలి. యువ‌తి త‌ల్లిదండ్రుల‌ను యువ‌కుడు, యువకుడి త‌ల్లిదండ్రుల‌ను యువ‌తి త‌మ సొంత వారిలా భావించి చూసుకోవాలి. దీంతో దంప‌తుల మ‌ధ్య ఎలాంటి మ‌న‌స్ప‌ర్థ‌లు రావు.

4. ఇంటికి సంబంధించిన ఏ విష‌య‌మైనా ఇద్ద‌రూ మ‌న‌ది అని భావించాలి. అందుకు స్పందించాలి. కేవ‌లం ఒక్క‌రు మాత్ర‌మే అలా భావించ‌రాదు.

5. ఏ స‌మ‌స్య వ‌చ్చినా దంప‌తులిద్ద‌రూ ఒక‌రికొక‌రు చెప్పుకోవాలి. అది చిన్న స‌మ‌స్య అయినా స‌రే. ఇద్ద‌రూ కూర్చుని మాట్లాడుకోవాలి. దంప‌తుల మ‌ధ్య క‌మ్యూనికేష‌న్ గ్యాప్ రాకూడ‌దు. వ‌స్తే అది విడిపోవ‌డానికి దారి తీస్తుంది.

6. పడ‌క గ‌ది అంటే శృంగారానికి మాత్ర‌మే వాడాలి. ఇత‌ర ఏ విష‌యాల‌ను చ‌ర్చించ‌రాదు. ఆఫీసు, ఇల్లు, కుటుంబ స‌భ్యులు.. ఇలా ఏ విష‌యాన్న‌యినా అక్క‌డ చ‌ర్చించ‌రాదు. అక్క‌డ కేవ‌లం ఆ ప‌నులు మాత్ర‌మే జ‌రగాలి.

7. దంప‌తుల‌న్నాక అప్పుడ‌ప్పుడూ ప‌లు విష‌యాల్లో ఇద్ద‌రికీ ఏకాభిప్రాయం రాక‌పోవ‌చ్చు. అంత‌మాత్రాన గొడ‌వ ప‌డ‌కూడ‌దు. ఒకరి అభిప్రాయాన్ని మ‌రొక‌రు గౌర‌వించాలి.

8. ఆహారం విష‌యంలోనూ క‌చ్చితంగా ఉండాలి. ఒక‌రికి న‌చ్చిన‌వే వండి తిన‌రాదు. ఇద్ద‌రూ ఇష్టాఇష్టాల‌ను పంచుకుని అందుకు అనుగుణంగా త‌మ‌కు ఇష్ట‌మైన రుచుల‌ను ఆస్వాదించాలి.

9. కొన్ని సార్లు ప‌లు విష‌యాల్లో దంప‌తులిద్ద‌రూ తీవ్రంగా స్పందిస్తుంటారు. అలా జ‌ర‌గ‌కూడ‌దు. చిన్న విష‌య‌మైనా స‌రే మ‌రీ అంత డీప్‌గా వెళ్ల‌కూడ‌దు.

10. ఎంత దంప‌తులైనా, ఒకే జీవితం జీవిస్తున్నా వారు మ‌నుషులే క‌దా. క‌నుక ఎవ‌రి ప్రైవ‌సీ వారికి ఉంటుంది. దాన్ని దంప‌తులిద్ద‌రూ గౌర‌వించుకోవాలి. కానీ సీక్రెట్స్ మాత్రం మెయింటెయిన్ చేయ‌కూడ‌దు. ఇద్ద‌రికీ ఒక‌రి గురించి మ‌రొక‌రికి పూర్తిగా తెలిస్తేనే మంచిది.

11. భార్యాభ‌ర్త‌ల రిలేష‌న్ షిప్‌లో ఎప్పుడూ ఒక‌రిపై మ‌రొక‌రికి గౌర‌వం త‌గ్గ‌కూడ‌దు. అది అలాగే మెయింటెయిన్ చేయాలి.

12. పిల్ల‌ల‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యంలోనూ భార్యాభ‌ర్త ఇద్ద‌రి ప్ర‌మేయం ఉండాలి.

13. అప్పుడ‌ప్పుడూ ఫ్యామిలీ అంతా క‌లిసి టూర్ల‌కు వెళ్లాలి. విహార యాత్ర‌ల్లో ఎంజాయ్ చేస్తే కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.

14. భార్య‌కు అనారోగ్యంగా ఉంటే భ‌ర్త‌, భ‌ర్త‌కు అనారోగ్యంగా ఉంటే భార్య తోడుగా ఉండాలి. వ‌దిలిపెట్టి వెళ్లే మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండ‌రాదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM