వినోదం

మార్చి 19న బాక్సాఫీస్ వార్.. రణ్‌వీర్ వర్సెస్ యశ్!

ఒకే రోజున విడుదల కానున్న యశ్ ‘టాక్సిక్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’. Photo Credit: Dhurandhar 2/Toxic/Instagram/X.

ఈ ఏడాది వేస‌వి ప్రారంభంలో రెండు భారీ ప్రాజెక్టు సినిమాలు పోటీ ప‌డ‌బోతున్నాయి. ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన ధురంధ‌ర్ 2తోపాటు క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ న‌టించిన టాక్సిక్ మూవీ కూడా ఒకే రోజున మార్చి 19, 2026న రిలీజ్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే రెండు భారీ సినిమాల మ‌ధ్య పోటీ ఎలా ఉండ‌బోతున్న‌ది ప్ర‌స్తుతం సినీ వ‌ర్గాల్లోనే కాదు, ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కుల్లోనూ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ధురంధ‌ర్ సినిమా మొద‌టి భాగం ఇచ్చిన సక్సెస్‌తో ర‌ణ్‌వీర్ సింగ్ ధురంధ‌ర్ 2 ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, కేజీఎఫ్ 2 స‌క్సెస్ అనంతరం య‌శ్ న‌టించి సినిమా కావ‌డంతో టాక్సిక్‌పై కూడా భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద రెండు హెవీ వెయిట్స్ మ‌ధ్య ఈసారి స్ట్రాంగ్ పోటీ ఉంటుంద‌ని ట్రేడ్ స‌ర్కిల్స్‌లో జోరుగా చర్చ జోరుగా సాగుతోంది.

ధురంధ‌ర్ 2, టాక్సిక్‌.. ట‌ఫ్ ఫైట్‌..?

ఈ రెండు సినిమాల్లోనూ ప‌లు కామన్ పాయింట్ల‌ను ఇప్ప‌టికే అభిమానులు నోట్ చేస్తున్నారు. ధురంధ‌ర్ మొద‌టి భాగంలో యాక్ష‌న్‌, వ‌యొలెన్స్ అధికంగా ఉండ‌గా దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ధురంధ‌ర్ 2ను తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది. అందువ‌ల్ల ధురంధ‌ర్ 2 కూడా అభిమానుల‌ను అల‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అలాగే య‌శ్ టాక్సిక్‌ టీజ‌ర్ ద్వారా ఈ సినిమాపై కూడా భారీగా అంచ‌నాల‌ను పెంచేశారు. ఇందులోనూ యాక్ష‌న్‌, వ‌యొలెన్స్ సీన్ల‌ను కొదువ లేద‌ని టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది. ధురంధ‌ర్ 2కు పోటీ త‌మ సినిమా ఉంద‌ని చెప్పేందుకే మేక‌ర్స్ టాక్సిక్ టీజ‌ర్‌ను అలా రిలీజ్ చేశార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ధురంధ‌ర్ 2, టాక్సిక్ మూవీలు బాక్సాఫీస్ వ‌ద్ద ట‌ఫ్ ఫైట్‌ను కొన‌సాగిస్తాయ‌ని అంటున్నారు.

ఆ అడ్డంకిని దాటితే..?

అయితే ధురంధ‌ర్ 2, టాక్సిక్ సినిమాల‌కు యాక్ష‌న్‌, వ‌యొలెన్స్‌, ఇత‌ర సీన్ల కార‌ణంగా క‌చ్చితంగా ఎ స‌ర్టిఫికెట్ ఇస్తారు. క‌నుక ఈ సినిమాల‌కు ఇదే పెద్ద మైన‌స్‌గా మారుతుంద‌ని అంటున్నారు. ఎందుకంటే సాధార‌ణంగా సినిమాల‌కు ఎ స‌ర్టిఫికెట్ వ‌స్తే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం మేక‌ర్స్‌కు క‌ష్టం అవుతుంది. సినిమా బాగుంద‌ని ఎంత టాక్ వ‌చ్చినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలాంటి సినిమాల‌ను చూసేందుకు వెనుక‌డుగు వేస్తారు. దీంతో అది క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. అయితే ఈ ఒక్క అడ్డంకిని ఈ సినిమాలు అధిగ‌మించాల్సి ఉంటుంది. అలా గ‌న‌క జ‌రిగితే స‌మ్మ‌ర్ బాక్సాఫీస్ ను ఈ సినిమాలు ఘ‌నంగా ప్రారంభించిన‌ట్లు అవుతుంది. మ‌రి అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి స‌మ్మ‌ర్ బాక్సాఫీస్ ప్రారంభ బ‌రిలో ధురంధ‌ర్ 2, టాక్సిక్ మూవీలలో ఏ సినిమా సూప‌ర్ హిట్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM