వినోదం

రెండో పెళ్లి ప్రచారంపై మీనా తీవ్ర అసహనం.. కూతురిని చూసైనా ఆపండి!

వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లపై వేదన వ్యక్తం చేసిన మీనా. Photo Credit: Meena/Instagram.

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మీనా తన వ్యక్తిగత జీవితంపై కొనసాగుతున్న అవాస్తవ ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తన రెండో వివాహంపై సోషల్ మీడియాలో విస్తరిస్తున్న వదంతులు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె స్పష్టం చేశారు. దృశ్యం 3లో మళ్లీ మోహన్‌లాల్ తో కలిసి ప్రేక్షకుల ముందుకు రానున్న వేళ ఈ తరహా పుకార్లు మళ్లీ తెరపైకి రావడం బాధాకరమని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనా.. నా రెండో పెళ్లి గురించి పదే పదే మాట్లాడటం పూర్తిగా అసహ్యకరం. నాకు ఒక కూతురు ఉంది. ఈ వార్తలన్నీ ఆమె కూడా చూస్తుంది అన్న సంగతి వాళ్లు మర్చిపోతున్నారు. అది మా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెడుతోంది.. అని వేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు మౌనం పాటిస్తున్నప్పటికీ, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని ఆమె హెచ్చరించారు.

తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు: మీనా

నటి, మహిళ కావడం వల్ల తమ వ్యక్తిగత జీవితంపై ఎవరైనా ఏదైనా రాయొచ్చన్న భావన కొందరిలో ఉందని మీనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో నిజం అన్నదే లేదు. నిజానికి కాస్తైనా ఆధారం ఉంటే ఓ అర్థం. కానీ కళ్లారా చూసినట్టు అబద్ధాలు రాయడం నన్ను బాధపెడుతోంది, కోపం తెప్పిస్తోంది.. అని మీనా అన్నారు. తాను ప్రతికూలతలను దూరంగా ఉంచుతూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని, అయినా ఇతరులను గాయపరిస్తే దానికి పరిణామాలు తప్పవని మీనా అన్నారు. ఇతరులను బాధపెట్టిన వారికి కర్మ తప్పదు అని ఆమె హెచ్చ‌రించారు. తన పెళ్లి గురించి మాట్లాడే హక్కు తనకే ఉందని, బయటి వాళ్లు కథలు అల్లడం సరికాదని స్పష్టం చేశారు.

కాగా సినిమాల విష‌యానికి చూస్తే మీనా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం దృశ్యం 3 ఈ ఏడాది ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం, ఆమె నటనా ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM

ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..

ఇటీవ‌లి కాలంలో చాలా వ‌ర‌కు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇత‌ర న‌టీన‌టుల‌కు చెందిన ఫొటోలు,…

Sunday, 5 April 2026, 3:18 PM

గ్యారంటీలపై రేవంత్‌కు బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం!

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 6 హామీల‌ను అస‌లు అమ‌లు చేయ‌లేద‌ని, రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స‌రే…

Saturday, 4 April 2026, 11:25 PM