Vijay Deverakonda : బాధ‌లో ర‌ష్మిక‌కి అండ‌గా నిలిచిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇద్దరి మ‌ధ్య రిలేష‌న్ నిజ‌మేనంటున్న ఫ్యాన్స్

November 11, 2023 3:47 PM

Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట ఒక‌టి. విజయ్ దేరవకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్న‌ప్ప‌టికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమించుకోగా, కొద్ది రోజుల‌కి వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్ర‌మంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. ఈ స‌మయంలో ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా క్లోజ్ అయ్యార‌ని, పెళ్లి కూడా చేసుకోవాల‌ని భావించార‌ని ప్ర‌చారం న‌డిచింది.

రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని వారు వెకేష‌న్స్‌కి కూడా క‌లిసే వెళుతున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు. దీనితో ఇది చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో తెగ వైర‌ల్ చేస్తున్న‌రు. ఈ ఇద్ద‌రి ఏముందో ఏమో తెలియ‌దు కాని తాజాగా విజ‌య్ దేవర‌కొండ‌.. ర‌ష్మిక‌కి ఫుల్ స‌పోర్ట్ అందించారు. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయడంతో దీనిపై ప‌లువువ‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్ర‌ముఖులతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు.

Vijay Deverakonda supported rashmika mandanna in recent issue
Vijay Deverakonda

ఈ క్ర‌మంలోనే రష్మిక ఫేక్‌ వీడియోపై టాలీవుడ్‌ స్టార్‌ నటుడు విజ‌య్ దేవరకొండ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ”భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన అడుగు ఇది అని చెప్పిన విజ‌య్… ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు తీసుకోవాలి.. మరోసారి ఇంకొకరికి ఇలాంటి ఘటన జరగకూడదు అని భావిస్తున్నాను.. డీప్‌ఫేక్‌ వీడియో చేసే వారి మీద వెంటనే చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని, వారిని వెంటనే శిక్షించాలని విజ‌య్ దేవ‌ర‌కొండ డిమాండ్ చేశారు. అలా చేసిన‌ప్పుడే మహిళలు రక్షించబడతారు అని విజయ్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్ట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now