Vichitra : టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలయ్య ఒకరు. ఇటీవలి కాలంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. బుల్లితెరతో పాటు వెండితెరపై తెగ సందడి చేస్తున్నారు. అయితే బాలయ్య ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌తో పాటు సీనియర్ హీరోయిన్స్‌తోను జోవియల్‌గా ఉంటారు. ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోను తెగ సందడి చేస్తుంటారు. అయితే ఆయనపై తాజాగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. కోలీవుడ్‌కు చెందిన సీనియర్ హీరోయిన్ విచిత్ర బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు అటు తమిళ సినీ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.నందమూరి బాలకృష్ణ సరసన భలేవాడివి బాసూ సినిమాలో నటించిన విచిత్ర ఓ గిరిజన యువతి పాత్రలో నటించింది.
అట్టర్ ఫ్లాప్‌గా నటించిన ఈ చిత్రంలో విచిత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. గి బాలకృష్ణ, శిల్పాషెట్టి, అంజల ఝవేరీ కాంబినేషన్‌లో 2001లో విడుదలైందీ మూవీ. పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకుడు. బాలయ్య కేరీర్‌లో ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను కాస్టింగ్ కౌచ్ వేధింపులను ఎదుర్కొన్నానని విచిత్ర తెలిపారు. తాజాగా ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 7కు గెస్ట్‌గా హాజరయ్యారు. సినిమాల్లో నటించేటప్పుడు తనకు ఎదురైన అనుభవాలను బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పంచుకున్నారు.నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో నటి విచిత్రను తన జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు.
దీనికి సమాధానంగా విచిత్ర మాట్లాడుతూ.. ”2001 సంవత్సరంలో నేను వేరే భాషలో ఒక సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యిందని పేర్కొంది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జరిగింది. సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను ఎదుర్కొన్నాను. పార్టీ ముగిసిన అనంతరం సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను అని పేర్కొంది.
అప్పుడు నాకేమి అర్థంకాలేదు. తరువాతి నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లొ పాల్గొన్నప్పటినుంచి తాను అనేక వేధింపులు, సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ తరువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయిందని, పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నానని విచిత్ర తెలిపారు. అయితే ఈ వీడియోలో బాలయ్య పేరును విచిత్ర ఎక్కడ వాడకపోవడం గమనర్హం. అయితే విచిత్ర తమిళంలో కాకుండా వేరే భాషలో నటించిన ఏకైక చిత్రం భలేవాడివి బాసూ. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బాలయ్య గురించే ఆమె కామెంట్స్ చేసిందని పలువురు చెప్పుకొస్తున్నారు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…