Venkatesh : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడు చాలా కూల్‌గా, సైలెంట్‌గా కనిపిస్తుంటారు. కాని ఎప్పుడు లేని విధంగా వెంకీమామ నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాతో మజాక్‌లొద్దు నెట్‌ఫ్లిక్స్ జాగ్రత్త అంటూ వెంకీమామ గరమయ్యాడు. ఈ సందర్భంగా చేతిలో గన్ పట్టుకుని వార్నింగ్ ఇస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెట్టింట తెగ వైరల్ గా మారింది. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి వెంకటేష్ తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్‌తో ‘గోపాల గోపాల’, రామ్‌తో ‘మసాలా’, వరుణ్ తేజ్‌తో ‘F2’ అండ్ ‘F3’, నాగ చైతన్యతో ‘వెంకీ మామ’ చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో కూడా చేయని విధంగా మల్టీస్టారర్ చిత్రాలు చేసిన ఘనత అందుకున్నాడు. ఇప్పుడు దగ్గుబాటి రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి డిజిటల్ తెరపైకి ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ పేరు రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఈ సిరీస్ కు సంబంధించిన హిందీ వెర్షన్ టీజర్ ను ఇటీవల నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో వెంకటేష్ కనిపించారు.
అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారని అర్ధమవుతుంది. జైల్లో చేతులకి సంకెళ్లతో తెల్లగడ్డంతో వెంకీ కొత్తగా కనిపించారు. తండ్రిపై చెప్పలేనంత ద్వేషంతో రగిలిపోయే కొడుకుగా రానా కనిపించాడు. అయితే ఈ సిరీస్ టైటిల్ మార్చాలంటూ గన్ పట్టుకుని మరి నెట్ ఫ్లిక్స్ కు వెంకటేష్ గట్టి ధమ్కీ ఇచ్చారు. “చాలా పెద్ద తప్పు చేస్తున్నావ్ నెట్ ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్ లో హీరో నేను. అందరి కంటే పెద్ద స్టార్ ని నేను. అందంగా కనిపించేది కూడా నేనే. పైగా ఫ్యాన్స్ కూడా నావాళ్లే. కాబట్టి షోకి కూడా నా పేరే ఉండాలి కాని రానా నాయుడు కాదు నాగా నాయుడు అని ఉండాలి. బాప్ కే పంగ నామాలు పెట్టొద్దు. నాతో మజాక్ లు చేయొద్దు” అంటూ గన్ పట్టుకుని హిందీలో మాట్లాడుతూ వెంకీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…