Unreleased OTT Movies : థియేట‌ర్స్‌లో రిలీజై ఇప్ప‌టికీ ఓటీటీలో విడుదల కాని సినిమాలు ఏంటంటే..!

November 19, 2023 9:52 PM

Unreleased OTT Movies : క‌రోనా స‌మ‌యం నుండి ఓటీటీల హంగామా ఎక్కువగా కొన‌సాగుతుంది. థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమాల క‌న్నా ఓటీటీలో విడుద‌లైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌పైనే నెటిజ‌న్స్ ఎక్కువ‌గా దృష్టిసారిస్తున్నారు.మ‌రోవైపు థియేట‌ర్‌ల‌లో రిలీజైన చిన్న సినిమాల‌తో పాటు పెద్ద సినిమాల‌ని కూడా నెల లేదా రెండు నెల‌ల గ్యాప్‌లో ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం థియేట‌ర్స్‌లో విడుద‌లై ఏడాది అవుతున్న‌ప్ప‌టికీ ఇంకా ఓటీటీలోకి మాత్రం రాలేదు. ఆ సినిమాలు ఏంట‌నేవి చూస్తే.. ముందుగా అక్కినేని హీరో అఖిల్ న‌టించిన ఏజెంట్ చిత్రం ముందు వ‌రుస‌లో ఉంటుంది.

ఏజెంట్ మూవీ థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి భారీ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయి ఏడు నెల‌లు దాటిన కూడా ఇప్ప‌టి వర‌కు ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ సినిమాని సోనీ లివ్ ద‌క్కించుకున్న‌ప్ప‌టికి ఏజెంట్‌ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డం, నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మ‌ధ్య గొడ‌వ‌ల ఎఫెక్ట్ కార‌ణంగా ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల కాలేదు. రెండు సార్లు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన కూడా కోర్టు ఇష్యూస్ వ‌ల‌న ఈ సినిమా ఇప్ప‌టికీ ఓటీటీలో విడుద‌ల‌య్యేందుకు నోచుకోలేదు. ఇక న‌య‌న‌తార న‌టించిన క‌నెక్ట్ చిత్రం థియేట‌ర్స్‌లో ఎప్పుడో విడుద‌ల కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు ఓటీటీ విడుద‌ల‌కి నోచుకోలేదు.

Unreleased OTT Movies fans are eagerly waiting to watch them
Unreleased OTT Movies

అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ నాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా ప్ర‌యోగాత్మ‌కంగా రూపొందిన క‌నెక్ట్ చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో థియేట‌ర్స్‌లో రిలీజైంది. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన ఈ మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ని డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ సినిమా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీకి నోచుకోలేదు. మ‌రోవైపు ది కేర‌ళ స్టోరీ. థియేట‌ర్ల‌లో విడుద‌లై 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. థియేట‌ర్ల‌లో నిర్మాత‌ల‌కు లాభాల పంట‌ను ప‌డించిన ఈ చిత్రాన్ని కొనుగోలు చేయ‌డానికి ఓటీటీ సంస్థ‌లేవి ముందుకు రాలేదు. సెన్సిటివ్ కంటెంట్ కావ‌డంతో వివాదాలు త‌లెత్తుతాయ‌నే భ‌యంతోనే ఓటీటీ సంస్థ‌లు కేర‌ళ స్టోరీని రిలీజ్ చేయ‌డానికి వెన‌క‌డుగు వేశాయి. ఇలా ఈ చిత్రాలు థియేట‌ర్స్ లో విడుద‌లై చాలా రోజులే అయిన ఓటీటీకి నోచుకోక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now