Trisha : చెన్నై చంద్రం త్రిష గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో నటించి వైవిధ్యమైన నటనతో అశేష ప్రేక్షకాదరణ పొందిన అందాల ముద్దుగుమ్మ త్రిష. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిన కూడా తమిళంలో మాత్రం మంచి అవకాశాలు దక్కించుకుంటుంది. రీసెంట్‌గా త్రిష లియో అనే చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఇందులో త్రిష నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక కీలక పాత్రలో కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటించారు. అయితే చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో మన్సూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.
నేను త్రిషతో నటిస్తున్నానని విన్నప్పుడు, సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. ఆమెను చేతులతో ఎత్తుకుని బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని భావించాను. కాని కాశ్మీర్ షెడ్యూల్‌లో సెట్స్‌లో అసలు త్రిషను నాకు చూపించనే లేదు అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ తన చేష్టలతో అందరికి చిరాకు తెప్పించాడు. మన్సూర్‌పై ఇప్పుడు ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోశారు. అవమానకరంగా, స్త్రీద్వేషంతో కూడిన అసహ్యకరమైన మాటలుగా, జుగుప్సాకరంగా ఉన్నాయి అంటూ అతడి వ్యాఖ్యలపై త్రిష కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అతని లాంటి దారుణమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను ఇంతకాలం పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని, నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అతనితో నటించకుండా చూసుకుంటాను. ఇలాంటి నీచమైన వ్యక్తి మగజాతికి మచ్చ తెచ్చేలా ఉన్నాడంటూ త్రిష తెలియజేసింది. మన్సూర్‌పై చిన్మయి శ్రీపాద కూడా దారుణంగా మండిపడింది. ఇలాంటి మనుషులు ఎప్పుడూ ఇలానే మాట్లాడుతుంటారు.. డబ్బు, అధికారం ఇలాంటివి చూసుకునే ఇలా నీచంగా అసహ్యంగా మాట్లాడతారంటూ మండిపడింది. మలయాళ నటి మాళవిక మోహన్, దర్శకుడు లోకేష్ కానగరాజ్వంటి ప్రముఖులు కూడా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…