Tripti Dimri On Animal Movie Scenes : యానిమ‌ల్ సినిమాలో బోల్డ్ సీన్స్‌పై తృప్తి దిమ్రీ పేరెంట్స్ అలాంటి కామెంట్స్ చేశారా..!

December 12, 2023 1:57 PM

Tripti Dimri On Animal Movie Scenes : ర‌ణ్‌బీర్ క‌పూర్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన చిత్రం యానిమ‌ల్. ఇందులో ర‌ష్మిక త‌న అంద‌చందాల‌తో కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేసింది. అయితే ర‌ష్మిక‌ని మించి ఓ భామ బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోవ‌డం హాట్ టాపిక్ అయింది. సైడ్ క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయికి సమానంగా పాపులారిటీ లభించింది. ఆ అమ్మ‌యి మ‌రెవో కాదు తృప్తి దిమ్రీ. ఈ సినిమాతో ఈ భామ బాలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక ‘యానిమల్’లో రణబీర్ కపూర్‌తో చేసిన ఇంటిమేట్ సీన్స్‌ పట్ల తన తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటో తాజాగా తృప్తి బయటపెట్టింది.

ణ్‌బీర్ కపూర్‌తో తన రొమాంటిక్ సీన్‌ చూసి తన పేరెంట్స్ ఆశ్చర్యపోవడంతో పాటు కాస్త ఫీలయ్యారని త్రిప్తి దిమ్రి వెల్లడించారు.ఇలాంటివి మేం సినిమాల్లో చూడలేము. నువ్వు ఇలా చేయకూడదు. కానీ ఫర్వాలేదు’ అని వారు చెప్పారని త్రిప్తి పేర్కొన్నారు. న‌టిగా త‌న ప‌ని తాను చేసిన‌ట్టు పేర్కొన‌డంతో వారు అర్ధం చేసుకున్నార‌ని త్రిప్తి స్ప‌ష్టం చేశారు. ఈ అమ్మ‌డు బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా సెటిల్డ్ గా నటించే ప్రయత్నం చేసింది. అలాగే, కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా ఆమె తన గ్లామర్ తో సినిమాకి ప్లస్ అయ్యింది. మొత్తానికి హై వోల్టేజ్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతూ అంద‌రికి మంచి పేరు కూడా తీసుకొచ్చి పెట్టింది.

Tripti Dimri On Animal Movie Scenes she told how her parents reacted
Tripti Dimri On Animal Movie Scenes

సెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’.. ఆ తర్వాత విడుదలయిన సినిమాల పోటీని కూడా తట్టుకొని ఇంకా థియేటర్లలో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతుండ‌డం షాకింగ్‌గా మారింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించగా.. బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశారు. చాలాకాలం తర్వాత బాలీవుడ్ వెండితెరపై బాబీ డియోల్‌కు ఈ రేంజ్‌లో హిట్ దక్కింది. ఇక సినిమాకు, తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి బాబీ డియోల్ సైతం పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. స్క్రీన్ టైమ్ కాసేపే అయినా బాబీ డియోల్ భార్యల పాత్రలు చేసిన ఆర్టిస్టులకు కూడా పాపులారిటీ దక్కింది. 3 గంటల 21 నిమిషాల నిడివితో ఇలాంటి ఒక యాక్షన్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం టాక్ ఆఫ్ ది టైమ్ అయిపోయింది. త్వ‌ర‌లో ఈ చిత్రం ఓటీటీలో రానుండ‌గా, అందులో సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువ ఉండే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now