Tollywood : నవంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు డిసెంబర్ నెలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ నెలలో భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి. ఇలా డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం అఖండ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించడంతో అఖండ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రస్తుతం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాతోపాటు డిసెంబర్ 10వ తేదీన మోస్తారు అంచనాల మధ్య విడుదల కాబోతున్న చిత్రం లక్ష్య. మరి ఈ సినిమా నాగ శౌర్యకు ఏ విధమైనటువంటి హిట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కూడా డిసెంబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాల్సి ఉంది. ఇది మాత్రమే కాకుండా నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కూడా డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇవే కాకుండా స్కైలాబ్, గుడ్ లక్ సఖి, గమనం వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…