Tollywood : డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ వ‌ద్ద‌ పోటీపడుతున్న చిత్రాలు ఇవే..!

December 2, 2021 4:38 PM

Tollywood : నవంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఈ క్రమంలోనే ప్రేక్షకులు డిసెంబర్ నెలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ నెలలో భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి. ఇలా డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

Tollywood these are the movies that releasing in december 2021 month

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన‌ చిత్రం అఖండ. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సాధించడంతో అఖండ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్ర‌స్తుతం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాతోపాటు డిసెంబర్ 10వ తేదీన‌ మోస్తారు అంచనాల మధ్య విడుదల కాబోతున్న చిత్రం లక్ష్య. మరి ఈ సినిమా నాగ శౌర్యకు ఏ విధమైనటువంటి హిట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

ఇక సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న‌ పుష్ప సినిమా కూడా డిసెంబర్ 17వ తేదీన‌ విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో తెలియాల్సి ఉంది. ఇది మాత్రమే కాకుండా నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కూడా డిసెంబర్ 24 న విడుదల కానుంది. ఇవే కాకుండా స్కైలాబ్, గుడ్ లక్ సఖి, గమనం వంటి సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now