Toby OTT Release : క‌న్న‌డ రివేంజ్ డ్రామా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అంటే..!

December 23, 2023 4:08 PM

Toby OTT Release : కన్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌కి చెందిన ప‌లు చిత్రాలు ప్రేక్ష‌కులని ఎంత‌గా అల‌రిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చే ప్ర‌తి చిత్రంపై తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఓ లుక్కేస్తున్నారు. అయితే కన్నడ చిత్రపరిశ్రమలో చెప్పుకోదగ్గ దర్శకుల్లో రాజ్ బి శెట్టి ఒకరు కాగా, ఆయ‌న తీసిన గరుడ గమన వృషభ వాహన చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నటుడు కమ్ డైరెక్టర్ రాజ్ బి శెట్టి లీడ్ రోల్ లో తాజాగా ‘టోబి అనే చిత్రం రూపొందింది. సిల్ అల్చలక్కల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ మూవీలో సంయుక్త హర్నాడ్, చైత్ర ఆచార్ హీరోయిన్లుగా నటించారు. ఇప్ప‌టికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

ఆగస్టు 25 న క‌న్న‌డ భాష‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వ‌గా పాన్ ఇండియా స్టార్ దుల్హ‌ర్ స‌ల్మాన్ త‌న బ్యాన‌ర్‌పై మ‌ళ‌యాళంలోకి డ‌బ్ చేసి సెప్టెంబరు 22న విడుదల చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ సినిమాకి అంత‌టా మంచి రెస్పాన్స్ రావ‌డంతో మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టాబీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. తెలుగులోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. టోబీ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల ఆడియోలో సంద‌డి చేస్తుంది.

Toby OTT Release know the platform and streaming details
Toby OTT Release

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే..తమస్ కట్టేలోని పోలీస్ స్టేషన్‌కు కొత్త‌గా సంప‌త్ అనే ఎస్సై విధుల్లో చేరతాడు. అదే స‌మ‌యంలో జెన్నీ అనే యువ‌తి త‌న పెంపుడు తండ్రి టోబీ క‌న‌బ‌డ‌డం లేదంటూ ఫిర్యాదు చేయ‌గా పోలీసులు ఆ కేసు ఇన్వెస్టిగేష‌న్‌లోకి దిగుతారు.ఈ క్ర‌మంలో కుశ‌ల‌ప్ప అనే కానిస్టేబుల్ సాయంతో చాలా మందిని ఎంక్వైరీ చేస్తూ టోబీ గురించి తెలుసుకుంటూ ప‌లు చోట్ల వెతుకుతుంటారు. అయితే ఇన్వెస్టిగేష‌న్‌లో అనేక విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. టోబీ గొంతు ఎలా కోల్పోయాడు, జైలుకు ఎందుకు వెళ్లాడు, పెళ్లి ఎందుకు చేసుకోలేక పోయాడు, వీటితో ఆ ఊరి పెద్దకు ఉన్న సంబంధేమేంటి వంటివి చిత్రం చూస్తే అర్ధ‌మ‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now