The Great Indian Suicide Review : హెబ్బా ప‌టేల్ న‌టించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ.. ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్.. రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

October 7, 2023 3:29 PM

The Great Indian Suicide Review : ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ సినిమా శుక్ర‌వారం ఆహా ఓటీటీ లో రిలీజ్ అయింది. రామ్‌కార్తిక్‌, హెబ్బా ప‌టేల్ జంటగా ఈ సినిమాలో నటించారు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ తెర మీదకి తీసుకు వచ్చారు. విప్ల‌వ్ కోనేటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ మూవీ ని థియేట‌ర్ల‌ లో రిలీజ్ చేయకుండా, డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహా లో శుక్ర‌వారం ఆక్టోబ‌ర్ 6న‌ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.

ముందు ఈ మూవీ కి టైటిల్ గా తెలిసిన వాళ్లు అని టైటిల్ పెట్టారు. ఆ తరవాత ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్‌గా పేరు మార్చి మూవీ ని తీసుకు వచ్చారు. య‌థార్థ‌ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా ని తీసుకు వచ్చారు విప్ల‌వ్ కోనేటి. ఇక కథ విషయానికి వస్తే.. హేమంత్ (రామ్‌కార్తిక్‌) అనాథ‌. స్నేహితుడితో క‌లిసి కాఫీ షాప్ ని నడుపుతుంటాడు. షాప్‌కు కుకీస్ స‌ప్లై చేస్తుంటుంది చైత్ర (హేభాప‌టేల్‌). ఇలా వీళ్ళు లవ్ లో పడతారు.

The Great Indian Suicide Review in telugu
The Great Indian Suicide Review

హేమంత్ ఆమెను పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అతనికి నో చెప్పేస్తుంది. కొద్ది రోజుల్లో కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటామని చెప్తుంది. యాక్సిడెంట్‌ లో చ‌నిపోయిన పెద‌నాన్న బ‌ళ్లారి నీల‌కంఠ‌య్యను (సీనియ‌ర్ న‌రేష్‌) ని తిరిగి బ‌తికించ‌డానికి ఆత్మ‌ త‌ర్ప‌ణం చేసుకుంటున్నామని ఆమె చెప్తుంది.

హేమంత్‌ అందరినీ సేవ్ చేయాలని అనుకుంటాడు. చైత్ర మెడ‌ లో తాళి క‌ట్టి ఆమె ఇంట్లో అడుగుపెడ‌తాడు. చైత్ర కుటుంబాన్ని హేమంత్‌ ఎలా కాపాడతాడు..? కాపాడ‌గ‌లిగాడా లేదా.. ? వాళ్లంతా ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవ‌రు…? ఇదే కథ. ఆఖరికి ఏం అవుతుందో తెలియాలంటే సినిమా చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment