Taraka Ratna : రెండు వారాలైనా ఇంకా కోలుకోని తార‌క‌ర‌త్న‌.. అస‌లు కార‌ణం ఏంటి..?

February 13, 2023 6:13 PM

Taraka Ratna : నందమూరి తార‌క‌ర‌త్న ఇటీవ‌ల గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరగా, ఆయ‌న‌కు ప్ర‌స్తుతం మెరుగైన‌ చికిత్స అందిస్తున్న విష‌యం తెలిసిందే. నందమూరి తారకరత్నకు సుమారుగా రెండు వారాలుగా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన శరీరం ట్రీట్ మెంట్ కు సహకరిస్తుందని తెలిపిన వైద్యులు స్పెషల్ ట్రీట్ మెంట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల విదేశీ వైద్యులనే నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక హెల్త్ మినిస్టర్ చొరవతో ఆయనకు విదేశీ వైద్యులు వైద్యం అందిస్తున్నారట.

తారకరత్నకు గుండె సహా మెదడుకు సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ ను వైద్యులు అందిస్తున్నారని ప్ర‌చారం న‌డుస్తుంది. నిరంతరం వారి పర్యవేక్షణలోనే తారకరత్నకు చికిత్స జరుగుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం తారకరత్న కోమాలోనే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు ఆశిస్తున్నారు. ఈ రెండు రోజుల‌లో తార‌క‌ర‌త్న హెల్త్ అప్‌డేట్ నారాయ‌ణ హృద‌యాల‌య వైద్యులు ఇవ్వ‌నున్నారని స‌మాచారం. . ఈ హెల్త్ బులిటెన్ తర్వాత మరింత క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇక నందమూరి కుటుంబ సభ్యులు నిత్యం తారకరత్న ఆరోగ్యం గురించి దగ్గరుండి ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

Taraka Ratna why is he still in coma what is the reason
Taraka Ratna

తార‌క‌ర‌త్న‌ గుండెల్లో 90 శాతం బ్లాకేజీ ఉందని, అందువల్లే ఆయ‌న ఇంకా కోమాలోనే ఉన్నాడ‌ని చెబుతున్నారు. మరోవైపు తారకరత్న కుప్పకూలి పడిపోయిన టైంలో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొంతమేర డ్యామేజ్ కూడా జరిగిందని, అందువ‌ల్లే ఇప్పటికీ స్పృహలోకి రాలేదని అంటున్నారు. అతడి మెదడు పనితీరు మెరుగుపరిచేందుకు, ఎప్పటిలానే వర్క్ చేసేందుకు స్పెషల్ న్యూరాలజిస్ట్ తో చికిత్స చేయిస్తున్నారట. దీనితోపాటు డాక్టర్స్ స్పెషల్ టీమ్ ఒకటి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదేమైన ఆయ‌న అభిమానులు, కుటుంబ స‌భ్యులు తార‌క‌ర‌త్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now