తార‌త‌ర‌త్న ప‌రిస్థితి మ‌రింత విష‌మం.. విదేశాల‌కు త‌ర‌లింపు..?

February 4, 2023 3:30 PM

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తార‌క‌ర‌త్న‌ గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు ఆయనకు ప్రత్యేక వైద్య బృందంతో చికిత్సను అందిస్తూనే ఉన్నారు. గత ఏడు రోజులుగా తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నప్ప‌టికీ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కొంత విష‌మంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. దీంతో నందమూరి తారకరత్న విషయంలో ఏం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.

తాజా ఆరోగ్య పరిస్థితిపై స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నందమూరి తారకరత్నను ఎయిర్ అంబులెన్సులో విదేశాలకు ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తారకరత్నను ఏ క్షణమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉందని.. బాలయ్య బాబు కూడా తారకరత్న యోగక్షేమాలు చూసుకునేందుకు ఎయిర్ అంబులెన్సులో వెంట వెళ్తారని టాక్.

taraka ratna condition is serious might be transferred to foreign

గుండెపోటు వ‌చ్చిన‌ప్ప‌టి నుండి నందమూరి బాలకృష్ణ తారకరత్న వద్దే ఉంటూ నిత్యం డాక్టర్లను సంప్రదిస్తూ.. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మ‌రోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. కాగా గుడెపోటు వచ్చిన టైమ్ లో  45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన తారకరత్న మెదడులో మెదడులో నీరు చేరి మెదడు వాచిందని, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్‌ రికవరీ అవుతుందని డాక్టర్లు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now