Sukumar Remuneration : ద‌ర్శ‌కుడు సుకుమార్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? నోరెళ్ల‌బెడ‌తారు..!

November 27, 2023 12:42 PM

Sukumar Remuneration : లెక్క‌ల మాస్టారు సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మంచి ఇమేజ్ అందుకున్నారు. పుష్ప చిత్రంతో సుకుమార్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే పుష్ప చిత్రం త‌ర్వాత పుష్ప2 సినిమాతో త‌న క్రేజ్ మ‌రింత పెంచుకోవాల‌ని భావిస్తున్నాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న డైరెక్ట‌ర్స్‌లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు ఒక‌రు.

‘బాహుబలి’కి ఆయన భారీ అందుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ చిత్రానికి అయితే వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ రూపంలో రాజమౌళి తీసుకున్నారని టాక్. తెలుగులో ఆ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నది సుకుమారే అని టాక్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతే.. మరో సందేహం లేకుండా దర్శక ధీరుడు రాజమౌళి పేరు అని అంటారు. బాహుబలి నుంచి ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. బహుబలి టైమ్‌ లోనే జక్కన్న దాదాపుగ 50 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని.. ఆతరువాత అవి ఇవి.. లాభాలు శేర్లు.. ఇలా అన్నిలెక్క కట్టుకుంటే.. దాదాపు వంద కోట్ల వరకూ ఆయనకువర్కౌట్ అయినట్టు సమాచారం.

Sukumar Remuneration do you know how much he is earning
Sukumar Remuneration

ఇక ఆర్ఆర్ఆర్ కు రెమ్యూనరేషనే.. 100కోట్లు తీసుకున్నాడట రాజమౌళి. ఇక పైన లెక్కలు ఎన్ని వచ్చి ఉంటాయో చెప్పనక్కర్లేదు. పుష్ప 2′ కోసం కొంత అమౌంట్, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే మొత్తంలో కొంత వాటా తీసుకునేలా సుకుమార్, నిర్మాతల మధ్య డీల్ జరిగిందట. ఇటీవల ‘పుష్ప 2’ డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. ఆ డీల్ తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ లెక్కకడితే వంద కోట్లు దాటిందని టాక్. పుష్ప సీక్వెల్‌కి ముందు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప : ది రైజ్’ కాకుండా ‘రంగస్థలం’ నిర్మించారు. ఆ రెండు సినిమాలకు లాభాలు వచ్చాయి. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన ‘కు కూడా వసూళ్లు బాగా వచ్చాయి. సుక్కుతో వాళ్ళకు మంచి మైత్రి ఏర్పడింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now