Sudigali Sudheer Gaalodu : జబర్ధస్త్ షోతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ సినిమాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. అతడు.. ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఆ తర్వాత హీరోగానూ మారి కొన్ని సినిమాలు చేయగా, అతడికి నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టారు. ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబర్ 18వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో పాటు అత్యధిక కలెక్షన్లను సాధించింది.
ఫుల్ రన్‌లో గాలోడు చిత్రం రూ. 9.91 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. తద్వారా రూ. 2.35 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటుకుంది అయితే ‘గాలోడు’ మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది కానీ, మూవీని విడుదలైన మూడు నెలలకు అంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ మూవీని రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రలు పోషించారు . సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన రీతిలో హవాను చూపిస్తున్న సుధీర్ రానున్న రోజులలో మరిన్ని మంచి చిత్రాలతో అలరించాలని అనుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…