SS Rajamouli : టాలీవుడ్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగాను ఎంతో క్రేజ్ అందుకున్న దర్శకులలో రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన ఇతను తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించాడు. మాస్, యాక్షన్, కామెడీ రొమాన్స్ ఇలా ఏ జానర్ అయిన సరే ప్రేక్షకులని రక్తి కట్టిస్తాడు. మన దేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన దర్శక బాహుబలి రాజమౌళి దర్శకుడిగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా సత్తా చాటాడట. ఈ సినిమా కొన్ని కారణాలవల్ల రిలీజ్ కాలేదు మరి ఈయన నటించినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాణంలో తన బాబాయ్ శివశక్తి దత్త దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం పిల్లన గ్రోవి.
పది సంవత్సరాల వయస్సులో రాజమౌళి పిల్లన గ్రోవి సినిమాలో నటించారట అంతే కాకుండా ఈ సినిమాలో తన సోదరి శ్రీలేఖ కూడా నటించారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చే సమయానికి ఫైనాన్షియల్ సమస్య రావడంతో ఈ చిత్రం విడుదల కాలేదు. దీంతో రాజమౌళిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసే అవకాశం లేకుండా పోయింది. ఈ చిత్రం విడుదలై మంచి హిట్ అయి, రాజమౌళికి మంచి పేరు వచ్చి ఉంటే ఆయన దర్శకుడిగా కాకుండా నటుడిగా ఉన్నత స్థానంలోకి వెళ్లేవారేమో అంటూ పలువురు ముచ్చటించుకుంటున్నారు.
సినీ 22 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అపజయం ఎరగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాను తెరకెక్కించారు రాజమౌళి. సి అశ్వనీదత్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రాజమౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా నుండి రాజమౌళి చేసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్టే. స్టూడెంట్ నెం. 1 చిత్రం నుంచి ‘రౌద్రం రణం రుధిరం’ వరకు ప్రతి చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక ఎన్టీఆర్, రాజమౌళి కలిసి మొదటి సారి స్టూడెంట్ నెం. 1కి పని చేశారు. ఆ తర్వాత సింహాద్రి, ఆపై యమదొంగ.. రౌద్రం రణం రుధిరం అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…